| Daily భారత్
Logo




ప్రోటోకాల్ ను అనుసరించరా? :ఎస్సీ, ఎస్టీ జాతీయ, కార్మిక, ఫెడరేషన్ నాయకుడు నూతుల నరేందర్

News

Posted on 2025-04-17 23:16:06

Share: Share


ప్రోటోకాల్ ను అనుసరించరా? :ఎస్సీ, ఎస్టీ జాతీయ, కార్మిక, ఫెడరేషన్ నాయకుడు నూతుల నరేందర్

దళిత కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి ని కించపరుస్తారా.?

శిలాఫలకం తొలగించడం పద్ధతి కాదు. 

ఎస్సీ, ఎస్టీ జాతీయ, కార్మిక, ఫెడరేషన్ నాయకుడు నూతుల నరేందర్ డిమాండ్.

డైలీ భారత్, పటాన్చెరు: నాటి 1995 సంవత్సరంలో అప్పటి మెదక్ జిల్లా పటాన్చెరు మండలం బీడీఎల్ పరిశ్రమ ముందు ఎన్నో ఆటంకాలు ఎదురైనా, ఎంతోమంది బెదిరింపులకు పాల్పడ్డా, వేరవకుండా పోరాడి ఏర్పాటు చేసుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తొలగించి ఆ విగ్రహం స్థానంలో అంబేద్కర్ నిలబడి ఉన్న విగ్రహం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా అప్పటి శిలాఫలకం తొలగించి నూతన శిలాఫలకం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ జాతీయ కార్మిక ఫెడరేషన్ నాయకుడు నూతల నరేందర్ నిరసన వ్యక్తం చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బిడిఎల్, భానుర్ లో ఆయన మాట్లాడుతూ 1995 సంవత్సరంలో బీడీఎల్ పరిశ్రమ ముందు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయ తలసి సుమారు 170 మంది బీడీఎల్ అధికారులు, కార్మికులు ఏకమై అధికారులు రూ 500 చొప్పున, కార్మికులు రూ 250 చొప్పున వారి వేతనాల్లో నుంచి సమకూర్చుకొని ఎన్నో ఆటుపోట్లకు ఎదురు నిలిచి, బెదిరింపులకు తట్టుకొని అప్పటి కేంద్ర మంత్రి జీ, వెంకటస్వామి చేతుల మీదుగా గద్దర్ సూచనల ప్రకారం నడుచుకుంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఆ విగ్రహాన్ని బీడిఎల్ పరిశ్రమ లో విధులు నిర్వహించిన ఓ అధికారి కళాకారుడు తన స్వాహస్థాలతో తీర్చిదిద్దాడని ఆయన తెలిపారు,జి.వెంకటస్వామి రూల్ అఫ్ రిజెర్వేషన్ అమలు పరచి ఎస్సి,ఎస్టీ,బిసి లకు ఉపాధి అవకాశాలు కలిగించారాని,పబ్లిక్ సెక్టార్ ఛైర్మెన్గా బి.డి.ఎల్ పరిశ్రమకు వర్క్ ఆర్డర్లు ఇప్పించారని అలాంటి వ్యక్తి పేరు తొలిగించడం శోచనియమని అన్నారు. అయితే ఇప్పుడు కొందరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిలబడి ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న కారణం చూపి అందుకు రాజకీయ రంగు పులిమారని ఆయన ఆరోపించారు. ఈ విగ్రహం ఏర్పాటు లో భానుర్ సర్పంచ్ సుమారు ఐదు లక్షలు నగదు ఇచ్చినట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. అయితే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిలబడి ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒకవేళ ఏదో కారణం చూయించి అప్పటి శిలాఫలకం తొలగిస్తే మాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఉన్న విగ్రహాన్ని తొలగించి నూతన విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న వారికి ప్రోటోకాల్ నిబంధనలు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో అగ్రవర్ణాల వారి తీవ్ర వ్యతిరేకతల మధ్య అన్ని సమస్యలను పరిష్కరించి విగ్రహం ఏర్పాటు చేసిన వారి పేర్లు తెరమరుగు చేయాలనుకోవడం సహించరాని విషయమని ఆయన ఆరోపించారు. దీనిపై త్వరలో బీడీఎల్ పరిశ్రమ యాజమాన్యం పై ఇప్పుడు నూతన విగ్రహం ఏర్పాటు పేర రాజకీయాలు చేస్తున్న వారిపై లోక్ సబాస్పీకర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇకనైనా అందరినీ కలుపుకొని ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ పాత శిలాఫలకం తొలగించకుండా నూతన విగ్రహం ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని అన్నారు. అలా కాకుండా పాత శిలాఫలకం తొలగిస్తే మాత్రం ఫిర్యాదులు, నిరసనలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >