Posted on 2025-02-25 16:19:11
ఉత్తరాస్ పల్లి ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : కొందూర్గ్ మండలంలోని ఉత్తరాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన ఉత్తరాస్ పల్లి ప్రీమియర్ లీగ్ ముగింపు సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కొందూర్గ్ మండలానికి క్రీడల పరంగా ఉజ్వల భవిషత్తు ఉందని తెలిపారు.అతి త్వరలో కొండుర్గ్ లో నిర్మించే మినీ స్టేడియం కి పరిపాలన అనుమతులు వచ్చినట్టు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం లో ప్రపంచ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ప్రారంభించబోతుందని తెలియజేశారు.తద్వారా ప్రపంచ స్థాయిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును సాధించి పెట్టడమే లక్ష్యంగా క్రీడాకారులను సన్నద్ధం చేస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి, క్రీడాకారుడు ఏదైనా ఒక క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని సాధించి ఆ క్రీడల్లో ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు. క్రీడల్లో రాణిస్తే మంచి పేరుతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు అని తెలిపారు. ఈ ప్రీమియం ప్రీమియర్ లీగ్ లో కొందూర్గ్ గ్రామ జట్టు విజేతగా నిలవగా, ఉత్తరాస్ పల్లి జట్టు రెండో స్థానంలో నిలిచింది. . ఈ కార్యక్రమంలో కొందుర్గ్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి,జితేందర్ రెడ్డి, జమృద్ ఖాన్,ఇబ్రహీం, అక్రం, గంగనమోని సత్తయ్య,సాయి రెడ్డి, పర్వతాపూర్ శ్రీనివాస్, రమేష్, గోపాల్ రెడ్డి, దామోదర్, రామకృష్ణ తదితరలు పాల్గొన్నారు..
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >