| Daily భారత్
Logo




కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీ చోరీ!!

News

Posted on 2025-02-24 09:48:31

Share: Share


కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీ చోరీ!!

డైలీ భారత్, కరీంనగర్ డెస్క్: కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్లో భారీ చోరీ జరిగింది. ప్రతాపవాడకు చెందిన రాఘవరెడ్డి ఇంట్లోకి ఆదివారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రాఘవరెడ్డి, అతని భార్యపై దాడి చేశారు. మెడపై కత్తులు పెట్టి బెదిరించి ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.బాధితుల చరవాణిలను తీసుకెళ్లి బయటపడేశారు. విషయం తెలుసుకొని వచ్చిన రాఘవరెడ్డి కుటుంబీకులు వచ్చి గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ తిరుమల్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేలి ముద్రలు, నిపుణులు, డ్వాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.రాత్రి మూడు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. కత్తి మెడపై పెట్టి బెదిరించారు. టవల్తో నోరు, కాళ్లు కట్టేసి దాడి చేస్తూ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలన్నారు. ఇంట్లో 70 తులల బంగారం, రూ.8 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. వెంటనే మా కుమారులకు ఫోన్ చేశాను. 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాను అంటూ బాధితులు వాపోయారు

Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >