Posted on 2025-02-12 19:03:40
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొదుమూరి సత్యనారాయణ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ నందు జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ లో జాతీయ ప్రధాన కార్యదర్శి కొదుమూరి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల అవలంబిస్తున్న విధానాలను ఖండిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ చట్టం చేయాలని ప్రభుత్వం తన చిత్తశుద్ధిని కనబరచాలని తెలియజేశారు గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తే బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ తప్పించుకోవడానికి అనేక మార్గాలను వెతుకుచున్నట్లుగా ఉందని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు సంవత్సన్నారా కాలంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే జనాభా బీసీ కులగనలను చేయలేదు బీసీల జనాభాను తక్కువ చూపిస్తూ ఓసిల జనాభాను ఎక్కువ చూపిస్తూ బీసీ రిజర్వేషన్లు తగ్గించే విధంగా కుట్రపన్ని న విధానాన్ని బీసీ సమాజం చూస్తోందని స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి జిల్లా కురిమెల్ల శంకర్ ఈ రాష్ట్రంలో ఓసిల జనాభాను పెంచి చూపిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని రాష్ట్రంలో సగభాగం జనాభా ఉన్న బీసీలకు బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలని రెక్టిఫై చేసి సరి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాడని ఇవాళ బీసీలను జనాభా తక్కువ చేసి చూపిస్తూ బీసీ రిజర్వేషన్లు గండి కొట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని ఇదే పద్ధతి కొనసాగిస్తే రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో తగిన గుణపాఠం జరుగుతుందని ప్రభుత్వాన్ని పెద్దవా చేశారు
ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమలాపురం సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ పల్లపు లక్ష్మణ్ జిల్లా నాయకులు కాసోజు రామాచారి తదితరులు ప్రసంగించారు
కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో అపశృతి
Posted On 2025-03-23 12:33:58
Readmore >మెదక్ ఎంపీ, రఘునందన్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసిన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
Posted On 2025-03-23 10:21:25
Readmore >120 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బూర్గంపాడు పోలీసులు
Posted On 2025-03-23 03:09:25
Readmore >ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలు
Posted On 2025-03-21 18:08:13
Readmore >