Posted on 2025-02-13 03:32:45
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై ఇటీవల దాడి
22 మందిపై కేసు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు నిందితులు అరెస్ట్ పరారీలో 16 మంది నిందితులు వెలుగులోకి రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు!
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నారు. రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డిపై అబిడ్స్, గోల్కొండ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
రంగరాజన్ పై దాడి కేసులో పోలీసులు మొత్తం 22 మందిని నిందితులుగా చేర్చారు. నిందితుల రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరరాఘవరెడ్డి విచారణలో నేరాన్ని అంగీకరించాడు.
గత జనవరిలో వీరరాఘవరెడ్డి అర్చకుడు రంగరాజన్ ను కలిశాడు. వీరరాఘవరెడ్డి ప్రతిపాదనకు రంగరాజన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో, నిందితులంతా జనవరి 25న పెనుగొండ ఆలయంలో కలుసుకున్నారు. ఫిబ్రవరి 4న మరోసారి దమ్మాయిగూడలో సమావేశమయ్యారు. తమ మాట వినకపోతే రంగరాజన్ పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 7న వారు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. తాము చెప్పినట్టు చేయకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక, రంగరాజన్ పై దాడిని వీడియో చిత్రీకరించిన నిందితులు... ఆ వీడియోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >