| Daily భారత్
Logo




రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

News

Posted on 2025-02-11 17:36:35

Share: Share


రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

డైలీ భారత్, అమరావతి: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాతలకు 15 నిమిషాల్లోనే లోన్ ఇచ్చేలా చూడాలని బ్యాంకర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందన్నారు. విచారణలో భాగంగా బ్యాంకుల నుంచి సైతం సమాచారం అవసరం ఉంటుందని, దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతుల అంశానికి సంబంధించి బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు. అర్హులైన రైతులు బ్యాంకుకు వస్తే వారికి కేవలం 15 నిమిషాల్లోనే లోన్ ఇచ్చే విధానం తీసుకురావాలని చంద్రబాబు నిర్దేశించారు. పీఎం సూర్యఘర్‌ పథకం  కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్తు అందించాలని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్‌ పరికరాలు 2 కిలోవాట్ల వరకు అందిస్తామన్న చంద్రబాబు.. తద్వారా ఉచిత విద్యుత్తు ఉత్పత్తితో పాటు.. మిగులు విద్యుత్తు ద్వారా వారు కొంతమేర అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఏపీలోనూ పంటల సాగులో మార్పులు వస్తున్నాయి. ఉద్యాన పంటలు, ఇతర లాభదాయక పంటల వైపు అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం, డెయిరీ, ఆక్వా రంగాలను మరింతగా ప్రోత్సహించాలి. పెట్టుబడి విషయమై బ్యాంకులకు వచ్చే అర్హులైన రైతులకు బ్యాంకులు సహకారం అందించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. 

ఇప్పటివరకూ రూ. 5.34 లక్షల కోట్ల రుణాలు  

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో పలు రంగాలకు చెందిన వారికి ఏకంగా రూ.5.34 లక్షల కోట్ల వరకు రుణాలిచ్చాం. తమ టార్గెట్‌లో 99 శాతం సాధించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో యూనియన్‌ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ మణిమేఖలై తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి రూ.2.64 లక్షల కోట్ల లోన్ టార్గెట్ కాగా, రూ.2.37 లక్షల కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగంలో రూ.3.37 లక్షల కోట్లకుగానూ ఇదివరకే రూ.3.26 లక్షల కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఎంఎస్‌ఎంఈ  రంగానికి రూ.79,905 కోట్ల రుణాలతో పాటు ప్రాధాన్యేతర రంగానికి సైతం రూ.2.08 లక్షల కోట్ల లోన్ ఇచ్చినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వాట్సాప్‌ గవర్నెన్స్‌  కోట్లాది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >