Posted on 2025-02-04 18:23:50
డైలీ భారత్ ,భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం గంజాయి కేసులో పది సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ (ఎఫ్.ఏ.సి. స్పెషల్ జడ్జి ఫర్ ఎన్. డి. పి. ఎస్.మొదటి అదనపు జిల్లా జడ్జి )పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా... టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ జి.ప్రవీణ్ కుమార్ 2019 నవంబర్ 11న టేకులపల్లి సెంటర్లో వాహన తనిఖీ చేస్తుండగా మహబూబాబాద్ కు చెందిన గూడూరు మండలం చెందిన భూక్య రాము, బోడా సుమన్, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పల్లిపాడుకు చెందిన బొంతు శంకరయ్య పసుపు రంగు గల టిఆర్ నెంబర్ గల ఆటో ను టేకులపల్లి బోడు కు వెళ్లేసెంటర్ లో ఆపి పరిశీలించగా అట్టి ఆటోలో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని వాటి బరువు 31 కేజీ 165 గ్రాములు వాటి విలువ 4 లక్షల 67,470/- రూపాయలు కలిగి ఉన్నదని టేకులపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరము అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రాజు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశాడు. కోర్టులో ఐదుగురు సాక్షుల విచారణ అనంతరము పై ముగ్గురిపై నేరము రుజువు కాగా, మనిషి ఒక్కoటికి పది సంవత్సరాల కఠిన కారగార శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాస్క్యూషన్ స్పెషల్ ఆదనపు పబ్లిక్ ప్రాసెక్యూటర్ , పి.వి.డి.లక్ష్మి లు నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ (ఎస్. ఐ.)జి.ప్రవీణ్ కుమార్, కోర్టు లైజాన ఆఫీసర్ ఎస్. కె.అబ్దుల్ ఘని, పిసి( కోర్టు డ్యూటీ ఆఫీసర్ )పులి రమేష్ లు సహకరించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >