Posted on 2026-03-12 13:54:55
డైలీ భారత్, హైదరాబాద్: నేరేడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్(41) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్. శ్రీనివాస్ 2012లో జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్ గ్రూప్స్ పరీక్షలకు ప్రీపేర్ అయ్యేందుకు భర్త శ్రీనివాస్ చాలా హెల్ప్ చేశాడు. భర్త సహాయంతో జ్యోతి గ్రూప్స్‌లో విజయం సాధించి ఎక్సైజ్ సీఐగా నియమితులయ్యింది. ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అంతే కాదు.. భర్తపై వరకట్నం వేధింపులు, విడాకుల కేసులు పెట్టింది. వేధింపులకు పాల్పడటంతో శ్రీనివాస్ తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురై నిన్న రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘భార్య వేధింపులు, కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాశాడు. శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా అతను మృతిచెందినట్లు గుర్తించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోదరుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ భార్య జ్యోతి సహా మరో 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >