| Daily భారత్
Logo




వరంగల్: అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

News

Posted on 2026-03-12 15:08:16

Share: Share


వరంగల్: అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

71 కరెంట్ మోటార్లు, రెండు వాహనాలు స్వాధీనం

డైలీ భారత్, వరంగల్: వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ సిసిఎస్ పోలీసులు కమలాపూర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో 7 మంది నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.6,60,000 విలువ గల 71 కరెంట్ మోటార్లు, దొంగతనాలకు ఉపయోగించిన ఒక ఆటో ట్రాలీ,ఒక కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన నిందితులు:

సిరిగిరి ప్రసాద్ (26) – తారకరామా కాలనీ, ఓదెల గ్రామం, పెద్దపల్లి జిల్లా

మోతే రాజు (25) – భగత్ సింగ్ నగర్, చున్నంబట్టి కాలనీ, మంచిర్యాల

టేకు నవీన్ – ప్రగతి నగర్, ఎన్టిపిసి, గోదావరిఖని

మోటం తిరుపతి – గాంధీ నగర్, మంచిర్యాల టౌన్

వారణాసి లక్ష్మణ్ (26) – ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల

మోటం నరేష్ (25) – గాంధీనగర్, మంచిర్యాల

వస్తం భీమేష్ (28) – భగత్ సింగ్ నగర్, మంచిర్యాల

పోలీసుల విచారణలో నిందితులు మద్యం సేవనానికి అలవాటు పడి తమ జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించేందుకు వ్యవసాయ బావులు మరియు కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలించి అమ్ముకుంటూ వచ్చినట్లు వెల్లడైంది

నిందితులు గతంలో కూడా కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించిన కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మొత్తం 71 మోటార్ల దొంగతనం:

దర్యాప్తులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్, దామెర పోలీస్ స్టేషన్ల పరిధిలో 34 మోటార్లు, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కేశవపట్నం, సైదాపూర్, ఇల్లంతకుంట ప్రాంతాల్లో 36 మోటార్లు, భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ దొంగిలించినట్లు తేలింది.

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఆదేశాల మేరకు  సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత , ఏసీపిలు పీ. సదయ్య,  ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు.

వంగపెళ్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు  ఆటో ట్రాలీ మరియు  కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరకాల ప్రాంతంలోని ఒక ఇంటిలో దాచిపెట్టిన మరికొన్ని మోటార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును ఛేదించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఎ. రాఘవేందర్, కె. రామకృష్ణ, కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఐటి కోర్ టీమ్ AAO మొహమ్మద్ సల్మాన్ పాషా, SI శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుళ్లు నసీమ్ హమ్మెద్, కె. మహేశ్వర్, వి. జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, వినోద్, కమలాపూర్ ఎస్. ఐ దిలీప్ మరియు సిబ్బందిని సెంట్రల్ జోన్ డీసీపీ అభినందించారు.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >