Posted on 2025-02-04 17:38:04
డైలీ భారత్, కొత్తగూడెం: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 నవంబర్ 12వ తేదీన బీఎస్పీ లో జాయిన్ అయింది మొదలు ప్రతి సంవత్సరం జిల్లా అధ్యక్ష హోదాలో 2020 మరియు 2021వ సంవత్సరంలో నాకు నిర్దేశించిన జన కళ్యాణ్ దివస్ డబ్బులను అందజేయడం జరిగింది.2022 మరియు 2023 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నాకు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీకి నిర్దేశించిన డబ్బులను అందజేయడం జరిగింది.2023 శాసనసభ ఎన్నికల్లో పార్టీ నుండి పోటీ చేయుటకు అవకాశం కల్పించినందుకు పార్టీ జాతీయ,రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల ఇచ్చిన జన కళ్యాణ్ దివస్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగతంగా నాకు ఐదు లక్షలు ప్రతి అసెంబ్లీకి లక్ష చొప్పున ఐదు లక్షలు మొత్తం కలిపి 10 లక్షల రూపాయలను లక్ష్యంగా విధించినారు కానీ అట్టి లక్ష్యాన్ని నేను అందజేయలేక పోతున్నందుకు చింతిస్తూ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని అట్టి రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ కు పంపినట్టు తెలిపారు.ఇన్ని రోజులు బీఎస్పీలో తనకు సహకరించిన నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.కామేష్ తో పాటు జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున్ రావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్,సోను, బన్ను తదితరులు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >