| Daily భారత్
Logo




కేంద్ర బడ్జెట్ లో దళితులకు తీవ్ర అన్యాయం : కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్

News

Posted on 2025-02-02 15:27:44

Share: Share


కేంద్ర బడ్జెట్ లో దళితులకు తీవ్ర అన్యాయం : కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్

బడ్జెట్లో దళితులకు కేటాయించిన నిధులను దళితుల  సంక్షేమం అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి

దళితులకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలి

దేశ వ్యాప్త సబ్ ప్లాన్ అమలు చేయాలి

కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్

డైలీ భారత్, సంగారెడ్డి: 2025-2026 ఆర్దీక సంవత్సరంలో 50,65,345రూ. లతో  కేంద్ర  ఆర్దీక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంకెల్లో తప్ప ఆచరణలో దళితుల అభివృద్ధికి చేసింది శూన్యమేనని కేవీపీఎస్ రాష్ట్ర  ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ విమర్శించారు 

ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో దళితులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సంగారెడ్డి లోని న్యూ బస్టాండ్ వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా అతిమేల మాణిక్ మాట్లాడుతు

దేశంలో 20 కోట్ల జనాభా కలిగిన దళితులకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు జరగలేదన్నారు. కేంద్ర బీజేపీ సర్కార్ గత పదేళ్లుగా కాగితాల్లో అంకెలను పెంచుతూ వాటి ఖర్చులో తుంచుతూ దళితులకు అన్యాయమే చేస్తుందని ఆయన విమర్శించారు.20 శాతం జనాభా కలిగిన దళితులకు 16 శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు జరిగాయన్నారు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద 1,68,478 కోట్లరూ.లు  సంక్షేమ బడ్జెట్లో 13,611 కోట్ల రూ. లు కేటాయించగా అంబరిల్లా బడ్జెట్లో 9400 కోట్లు కేటాయించారని చెప్పారు మొత్తం బడ్జెట్ లో సుమారు 8వేల కోట్ల రూ. లు రివైజ్ చేశారని దీనివల్ల దళితులకు అన్యాయం జరిగిందన్నారు. 2024 -25 బడ్జెట్లో 1,65,597.70 కోట్ల రూపాయల కేటాయించి ఇప్పుడు ప్రస్తుతం 2025 -26 బడ్జెట్లో కేవలం 3000 కోట్ల రూపాయలు మాత్రమే పెంచారని  చెప్పారు .అది కూడా జనాభా దామాషా ప్రకారం పెంచలేదన్నారు దళితుల బడ్జెట్ను అంబ్రరిల్లా స్కీం ప్రకారంగా 102 శాఖల ద్వారా ఖర్చు చేస్తున్నారని మొత్తం బడ్జెట్ ను ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని కేటాయించి బడ్జెట్ అంతా ఒకచోట ఫూల్ చేసి కేవలం దళితుల సంక్షేమం కోసమే వారి ప్రత్యక్ష ప్రయోజనాల కోసమే ఖర్చు చేయాలన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా దళితుల బడ్జెట్ ను దళితేతరులకు ఖర్చుపెట్టిందన్నారు. రోడ్లు భవనాలు పార్కులు వీటన్నిటి అభివృద్ధి కోసం దళితుల బడ్జెట్ను ఖర్చు పెట్టారనివిమర్శించారు  దళితుల విద్యా వైద్యం ఉపాధి మంచినీటి సౌకర్యం రహదారుల సౌకర్యం విద్యుత్ దీపాల సౌకర్యం కోసం దళితుల బడ్జెట్ ను ఖర్చు చేయాలన్నారు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేయకపోవడం వల్ల దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించబడటం లేదన్నారు. దళితులు నేటికీ అక్షరాస్యతలో 64% దగ్గరే ఆగిపోయారని వారి అక్షరాస్యత అభివృద్ధి కోసం చేసింది శూన్యం అన్నారు తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళలు 30 శాతం అక్షరాస్యతే కలిగి ఉన్నారని చెప్పారు గ్రామీణ ప్రాంతాలలో కనీస ప్రాథమిక సౌకర్యాలకు నోచుకోకుండా ఇల్లు ఉపాది కి నోచుకోవడం లేదన్నారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు  కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను అంకెల్లో పెంచుతూ వాటిని ఖర్చు చేయడంలో ఘోరంగా విఫలమవుతుందన్నారు మొత్తం దశాబ్దకాలంలో కేంద్ర బీజేపీ సర్కార్ దళితుల కోసం కేటాయించిన బడ్జెట్ ఖర్చు చేసిన నిధులు దళితుల సంక్షేమానికి జరిగిన ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. అశోక్ జిల్లా నాయకులు దత్తు నితిన్ శ్రీహరి

Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం

Posted On 2026-07-26 14:40:51

Readmore >
Image 1

గాంధారి మండలంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

Posted On 2026-07-26 14:36:26

Readmore >
Image 1

భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్

Posted On 2026-07-26 14:34:52

Readmore >
Image 1

గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

Posted On 2026-07-26 14:33:18

Readmore >
Image 1

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు!

Posted On 2026-07-26 12:36:09

Readmore >
Image 1

జాగ్రత్త... ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు

Posted On 2026-07-26 10:51:59

Readmore >
Image 1

అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-26 07:26:29

Readmore >
Image 1

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

Posted On 2026-07-26 05:15:34

Readmore >
Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >