Posted on 2025-02-02 15:46:07
పఠాన్ చేరు, డైలీ భారత్:నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే విద్యావేత్తలను ఈ సమాజానికి అందించాలని పటాన్ చెరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ సాయి భగవాన్ కాలనీలో ఐఐటి చుక్కా రామయ్య ఇష్టా జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని . ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోటాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... చుక్కారామయ్య ఐఐటి సంస్థలను ఏర్పాటు చేసి ఎందరినో భవిష్యత్తు తరాల ఇంజనీర్ల ను సమాజానికి అందించి ఐఐటి రామయ్యగా అందరికీ సుపరిచితులయ్యారని అన్నారు.
ఐఐటి చుక్కా రామయ్య విద్యా సంస్థలు బీరంగూడ కు రావడం చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఈ కళాశాల మరిన్ని ఐఐటి, నీట్ ర్యాంకులను విద్యార్థులకు అందించాలని అలానే విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని ఆశిస్తున్నాను అని అన్నారు. ఇష్టా విద్యాసంస్థలు అకాడమీ ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపిసి, ఎంఈసి, సిఈసి గ్రూపులతో పాటు ఐఐటి, నీట్, ఎన్డిఏ, సీఏ, సివిల్స్ కోచింగ్ లు కూడా ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇష్టా విద్యా సంస్థల డైరెక్టర్ వినోద్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >