వారంలో రెండవసారి మెరుపు దాడి.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని నమ్మదగిన సమాచారం మేరకు కృష్ణసాగార్ గ్రామ శివారులో కోడి పందాలు నడుస్తుండగా అట్టి స్థావరంపై భద్రాద్రి కొత్తగూడెంజిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు. నిర్వహించినారు ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఐదు కోడిపుంజులు సుమారు 17వేల నగదు దొరికినట్టు సమాచారం. మండలంలో వారం గడకవకముందే 2వ సారి మెరుపు దాడి నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ ఏ .రమాకాంత్, జిల్లా టాక్స్ ఫోర్స్ ఎస్సై ప్రవీణ్, ఎస్సై రామారావు సిబ్బంది పాల్గొన్నారు.