| Daily భారత్
Logo




కార్మికులకు పని కల్పించాలి : కడారి రాములు

News

Posted on 2024-10-29 11:44:41

Share: Share


కార్మికులకు పని కల్పించాలి : కడారి రాములు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘము ఆధ్వర్యంలో సిరిసిల్ల లేబర్ అడ్డా పై భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి.రాములు మాట్లాడుతూ గత 3 నెలలుగా ఇసుక,మొరం కు అనుమతులు లేకపోవడంతో లేబర్ అడ్డాపై కూలీలకు పనిలేక,బతకడానికి పూట గడవక తిండికి కూడా తీవ్ర ఇబ్బంది అవుతోందని అన్నారు.బీహార్,UP లాంటి వలస కూలీ లతో స్థానిక కార్మికులకు ఉపాది లేకుండా పోయిందని,వారు తక్కువ కూలీకి పని చేయడంతో స్థానికులకు తీవ్ర నష్టం అవుతోందని ఇట్టి విషయంలో ఇతర రాష్ట్రాల లేబర్ కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకొనైనా స్థానిక కార్మికుల ఉపాధిని కాపాడాలని అన్నారు.కొద్దీ రోజుల క్రితం ఇసుకకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఒక ట్రాక్టర్కు 4 ట్రిప్పులు మాత్రమే వారానికి ఇవ్వడంతో అందరికి పని దొరకక ఇబ్బంది పడుతున్నారని ప్రతిరోజు ఇసుక పర్మిషన్ లు ఇవ్వాలని కోరారు.అలాగే నూతన లేబర్ కార్డులు అందించడం కోసం ఆన్లైన్ సైట్ ను ఓపెన్ చెయ్యాలని నిన్నటి రోజు భవన నిర్మాణ సంక్షేమ బోర్డ్ కమిషనర్ గంగాధర్ కి వినతి పత్రం ఇవ్వడంతో తక్షణమే ఆయన స్పందించి ఓపెన్ చేస్తామని,పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తామని,రిన్యువల్ కార్డులు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు,కావున కార్మికులు గమనించాలని అన్నారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జ.వేణు,కలికోట.దేవదాసు, తంగానపెళ్లి.పొసయ్య తదితర భవనిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >