| Daily భారత్
Logo




మహనీయులకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

News

Posted on 2024-10-02 17:57:10

Share: Share


మహనీయులకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఈ తరానికే కాదు ఏ తరానికైనా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి మహనీయులే ప్రజలకు ఆదర్శమని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డిలు,మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ కొనియాడారు. అక్టోబర్ 2 పురస్కరించుకొని మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతులను టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గంజ్ రోడ్డులో గల మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, ప్రముఖ సీనియర్ నేత నాగిళ్ల గోపాల్ గుప్తా, బీఆర్ఎస్ స్థానిక కౌన్సిలర్లు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ.. అహింస ఆయుధంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీజీ కీలకపాత్ర పోషించాలని వారు పేర్కొన్నారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసతో గడగడలాడించిన గాంధీజీ సిద్ధాంతాలు ప్రజలకు ఎల్లప్పుడూ ఆదర్శమేనని  అన్నారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చాక మాజీ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి తీసుకొచ్చిన అనేక సంస్కరణలు, సంక్షేమ అభివృద్ధి ఫలాలు వారి సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. ఆ త్యాగదనుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, సీనియర్ నేతలు నాగిళ్ల గోపాల్ గుప్తా, యాదవ చారి, వంకాయల నారాయణరెడ్డి, ఈట గణేష్, సుధీర్, రవి యాదవ్, కౌన్సిలర్లు మహేశ్వరి, పిల్లి శారద శేఖర్,  శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, కానుగు అనంతయ్య, జూపల్లి శంకర్, చిన్న, పాండురంగారెడ్డి,భిక్షపతి నక్కల వెంకటేష్ గౌడ్, మురళి యాదవ్, గౌస్ జానీ, చెన్నయ్య, సునీల్, శ్రీకాంత్ గౌడ్,శ్రీకాంత్,రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు..

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >