| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

24 గంటల్లో హత్యకు సంబంధించిన నిందితులను పట్టుకున్న వేములవాడ టౌన్ పోలీసులు

24 గంటల్లో హత్యకు సంబంధించిన నిందితులను పట్టుకున్న వేములవాడ టౌన్ పోలీసులు

వేములవాడలో నిన్న మల్లయ్య అనే వ్యక్తినీ హత్య చేసిన 5 గురు నిందితులు రిమాండ్ కు తరలింపు

డైలీ భారత్, వేములవాడ:  నిన్న అనగా 29.12.2024 వేములవాడ పట్టణం భగవంత రావు నగర్ కి చెందినటువంటి మామిండ్ల మల్లయ్య అను వ్యక్తికి తన మొదటి భార్య పిల్లలతో ఆస్తి పంపకాల విషయంలో, తగాదాలు జరగడంతో, ఇది దృష్టిలో పెట్టుకొని అతని మొదటి భార్య పిల్లలు అయినటువంటి మామిండ్ల రాజు, అత్తిలి జమున, లంబ మౌనిక మరియు అల్లుళ్ళు అత్తిని  రాజేందర్, లంబ బాలకృష్ణ ఈ ఐదుగురు కలిసి పథకం ప్రకారం మామిండ్ల మల్లయ్యను దారుణంగా చంపారు. అంతేకాకుండా మల్లయ్య యొక్క రెండవ భార్య అయినటువంటి పద్మను కూడా తీవ్రంగా గాయపరిచారు. దీంతో వేములవాడ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి 24 గంటల్లో నిందితులను పట్టుకుని రిమాండ్ కి తరలించామని ప్రకటనలో తెలిపారు..

Previous ఆవు ను ‘రాజ్య మాత’గా ప్రకటించిన ప్రభుత్వం
Next ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణ హత్య!
ADVERTISEMENT