| Daily భారత్
Logo




ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణ హత్య!

News

Posted on 2024-10-01 10:32:43

Share: Share


ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణ హత్య!

డైలీ భారత్, హైదరాబాద్: ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ప పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..యూసుఫ్‌గూడ, నవోదయ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ వద్ద నివాసముండే ఉమామహేశ్వరరావు ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు.

ఎల్లారెడ్డిగూడలోని టెంపుల్ పక్కన అమ్మ క్లినిక్ పేరిట ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. అయితే, నవోదయ కాలనీలోని ప్లాట్ నెంబర్.36 రెండవ ఫ్లొర్‌లో తన భార్య సుధారాణి (44), కుమార్తె రుద్రారాణి, కుమారుడు శ్రీకర్‌ చంద్రతో కలిసి ఉంటున్నాడు.

అయితే,సోమవారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పక్క వీధిలో ట్యూషన్ కోసం వెళ్లారు.భర్త ఉమామహేశ్వర రావు క్లినిక్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే పిల్లలు తిరిగి వచ్చేసరికి సుధారాణి రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉంది. గమనించిన పిల్లలు వెంటనే తండ్రికి ఈ విషయాన్ని చెప్పారు.సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోగానే సుధారాణి చనిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్దారించారు.డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీం ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >