Posted on 2024-10-01 11:30:31
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఇంట్లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి గాయాలైనట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను తీసుకెళ్తుండగా అది చేతి నుంచి జారి కిందపడింది. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే వైద్యులు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >