| Daily భారత్
Logo




దొరల గడిలను గడగడలాడించిన వీరవనిత ఐలమ్మ : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

News

Posted on 2024-09-10 14:16:35

Share: Share


దొరల గడిలను గడగడలాడించిన వీరవనిత ఐలమ్మ : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

షాద్ నగర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

ఐలమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

హాజరైన మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దొరల పెత్తనాన్ని ఎదురించి

రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత, దొరల గడిలను గడగడలాడించిన విప్లవ మూర్తి చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ లు కొనియాడారు.. 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వీరితోపాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ..

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్యే వేదికైందనీ, తొలి భూపోరాటానికి నాంది పలికింది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి సాయుధ పోరాటాన్ని గడగడలాడించారని అన్నారు. ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చాకలి ఐలమ్మ పోరాట నేపథ్యం గురించి వారు స్మరించుకుంటూ.. ప్రస్తుత వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్‌ 26న ఓరుగంటి మల్లమ్మ-సాయిలు దంపతులకు నాల్గవ సంతానంగా ఐలమ్మ జన్మించిందనీ, కాగా, 1921లో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభమైన ఆంధ్రజన సంఘం మారిన పరిస్థితుల కారణంగా రాజకీయ స్వరూపాన్ని సంతరించుకున్న వేళ 1944లో భువనగిరి మహాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రాబల్యంతో భూమి, భుక్తి కోసం పోరాటాలు మొదలయ్యాయన్నారు. ఈ మహాసభతో ఉత్తేజం పొందిన ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్తగా చేరి చురుగ్గా పనిచేసిందనీ, పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి భూములు కౌలుకు తీసుకొని పండించిన పంట పొలాలపై విస్నూరు దేశ్‌ముఖ్‌ కిరాయి గూండాలు దాడులు నిర్వహించి ధాన్యాన్ని స్వాధీన పరుచుకున్న క్రమంలో ఆంధ్ర మహాజన సభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారనీ కిరాయి రౌడీలను తరిమి కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారన్నారు. ఈ నేపథ్యంలో రజాకార్లు ఐలమ్మ ఇంటిని తగులబెట్టి ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఆమె కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారనీ 

ఈ క్రమంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బీజం పడగా, పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యంతో పాటు 90 ఎకరాల భూమిని ప్రజలకు పంచారనీ ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది అమరులు కాగా, మొత్తంగా 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగిందనీ చివరకు 1985 సెప్టెంబర్‌ 10న ఐలమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచిందనీ ఆమె సేవలను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కౌన్సిలర్లు కానుగుఅనంతయ్య, బచ్చలి నరసింహ, టిఆర్ఎస్ నాయకులు జూపల్లి శంకర్ పిల్లి శేఖర్, చెరుకు శివ తదితరులు పాల్గొన్నారు..

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >