| Daily భారత్
Logo




హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదు...ట్యాంక్ బండ్ పై వెలసిన ఫ్లెక్సీ లు

News

Posted on 2024-09-10 10:33:52

Share: Share


హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదు...ట్యాంక్ బండ్ పై వెలసిన ఫ్లెక్సీ లు

ట్యాంక్ బండ్ పై వెలసిన ఫ్లెక్సీ లు

డైలీ భారత్, హైదరాబాద్:గణేష్‌ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే వినాయకులు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తుంటారు.

ఖైరతాబాద్ గణేశుడి నుంచి వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. కానీ.. ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఈసారి ఫుల్ స్టాప్ పడనుంది. ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్‌ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ… బ్యానర్లు కట్టారు.

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేసిన విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయరాదని గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు. సాగర్ పరిరక్షణ బాధ్యతలను హైడ్రా చూస్తోందని పేర్కొంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే హైకోర్టు విచారణ చేయకముందే హుస్సేన్‌ సాగర్‌ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై సర్వాత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >