| Daily భారత్
Logo




బీఆర్ఎస్ చేస్తే సంసారం....మేం చేస్తే వ్యభిచారమా? : ఎమ్మెల్యే దానం నాగేందర్

News

Posted on 2024-09-10 14:17:52

Share: Share


బీఆర్ఎస్ చేస్తే సంసారం....మేం చేస్తే వ్యభిచారమా? : ఎమ్మెల్యే దానం నాగేందర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో  మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంపై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘నేను రూల్ ప్రకారమే ఎంపీగా పోటీచేశాను. బీఆర్ఎస్ వాళ్లు మాకు రూల్స్ చెప్తారా?. అనర్హత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కి లేదు. ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కేసీఆర్’’ అని దానం నాగేందర్ మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వ హాయాంలో పీఏసీ ఛైర్మన్ బాధ్యతలు అక్బరుద్దీన్ ఒవైసీకి ఎందుకు ఇచ్చారని బీఆర్ఎస్‌ను దానం నాగేందర్ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ హాయాంలో ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఎందుకు ఇవ్వలేదు?. స్పీకర్ నిర్ణయం తర్వాత మా నిర్ణయం మేం చెప్తాం. బీఆర్ఎస్ నాయకులు శునకానందం పొందుతున్నారు. సరైన సమయంలో ఏం చేయాలో మాకు తెలుసు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారా?. రాష్ట్ర ఖజానా దోచుకున్న వాళ్లు ఇప్పుడు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నారు?. వాళ్లపై వస్తున్న ఆరోపణలు తప్పించుకునేందుకు మాపై ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. అనర్హతకి సంబంధించి ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతా. దోచుకున్న డబ్బు దాచుకోవడానికి కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీలో ఓడిన వాళ్లకి విశ్వాసం లేదు. గెలిచిన వాళ్లకి విశ్వాసం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థం కాక భయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరు’’ అని దానం నాగేందర్ అన్నారు.

Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >