Posted on 2024-09-09 07:49:54
గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్‌లో ఉద్రిక్తత
డైలీ భారత్, సూరత్: వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటుచేసి వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలో గణపతి మండపంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక మండపంపై రాళ్లు రువ్వడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సయ్యద్‌పురా ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాంతి బలార్ సంఘటనా స్థలానికి చేరుకుని.. నిందితులను వదిలిపెట్టబోమని, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. కొన్నిచోట్ల బాష్పవాయువు ప్రయోగించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని అరెస్టు చేశారు.
సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై రాళ్లు రువ్విన ఘటనలో ఆరుగురు వ్యక్తులను గుర్తించినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. ఈ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. వీరితో పాటు మరో 27 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందన్నారు. సూరత్‌లోని అన్ని ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >