| Daily భారత్
Logo




కాల్చిన అల్లం, తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా..!

Health

Posted on 2024-09-09 13:29:53

Share: Share


కాల్చిన అల్లం, తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా..!

డైలీ భారత్, హెల్త్: వానాకాలం వర్షాలు, వరదలు, బురద కారణంగా జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి కామన్ గా పిల్లలు, పెద్దల్లో కనిపించే సీజనల్ ఇబ్బందులు. వీటి నుంచి ఉపశమనానికి వంటింట్లో ఉపయోగించే వస్తువులతో చికిత్స తీసుకోవడం వల్ల మళ్లీ మళ్లీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. అల్లం కాస్త ఘాటుగా ఉన్నా కఫాన్ని తగ్గించడంలో ప్రముఖంగా పనిచేస్తుంది. అల్లంతో పాటుగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వర్షాలతో తేమ కారణంగా వచ్చే అనేక సమస్యలకు, అంటు వ్యాధులకు అల్లం, తేనె దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఈ రెంటినీ కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాం.

వర్షాకాలంలో గొంతు నొప్పి తగ్గించడానికి అల్లాన్ని వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది. ఇలా కుదరకపోతే అల్లాన్ని తురిమి లేదా దంచి రసం తీయాలి. అల్లం, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అల్లాన్ని పచ్చిగా కాకుండా కాల్చినది తీసుకుంటే మంచిది.

అల్లం, తేనెతో కలిగే ప్రయోజనాలు...

అల్లం పై పొట్టును తొలగించి తురుముకోవాలి. దీనిని మెత్తగా చేసుకున్నాకా కాస్త తేనెను కలిపి తీసుకోవాలి. అల్లం, తేనెతో గొంతులో వాపును కూడా తగ్గిస్తుంది. వేయించిన అల్లాన్ని తేనెతో కలిపి తీసుకుంటే గొంతులో పేరుకున్న శ్లేష్మం వెంటనే బయటకు వస్తుంది. దగ్గు, కఫం నుంచి ఉపశమనానికి, గొంతు నొప్పికి అల్లం, తేనె మిశ్రమం చక్కగా పనిచేస్తుంది. ఇది గొంతులోని ఇబ్బందిని, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది.

ఎముకలకు బలం..

అల్లాన్ని కాల్చి తీసుకోవడం వల్ల ఎముకలకు మంచిది. వేయించిన అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఇది చక్కని ఉపశమనాన్ని అందిస్తుంది. బోలు ఎముకల సమస్యను తగ్గిస్తుంది.

మధుమేహం ఉన్నవారికి..

మధుమేహానికి కూడా అల్లం, మధుమేహా రోగులకు కూడా మేలు చేస్తుంది. వేయించిన అల్లం మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

తలనొప్పికి..

విపరీతమైన తలనొప్పి, నరాల బాధ ఉన్నవారు, మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు కాల్చిన అల్లానికి బదులుగా అల్లం నీటిని తీసుకుంటే మంచిది.

రోగనిరోధక శక్తికి..

వేయించిన అల్లం, తేనె వర్షాకాలంలో క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం, తేనె తీసుకుంటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. ఇది అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పిల్లలకు 1 టీస్పూన్ తేనెలో కొద్దిగా అల్లం రసం కలిపి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది..

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >