Posted on 2024-09-08 12:58:06
లక్ష్మీ నగర్ బాధితుల నిరసన
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీజాపూర్ రహదారి విస్తరణలో భాగంగా చేవెళ్లలో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని లక్ష్మీ నగర్ కాలనీ బాధితులు డిమాండ్ చేశారు. 2018లో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని వారు వాపోయారు. ప్లాట్లు కోల్పోతున్న బాధితులంతా ఆదివారం కాలనీలో సమావేశమయ్యారు. కొన్ని నెలలుగా అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం జరగడం లేదన్నారు. పైసా పైసా కూడా పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశామని.. ప్రభుత్వ పరిహారం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని ప్లాట్లు కోల్పోతున్న బాధితులు రాజశేఖర్ రెడ్డి, బసవరాజ్, సందీప్ కుమార్, కిరణ్, ప్రతాప్ రెడ్డి, సతీష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అమృత, శ్రీదేవి, నజీర సుల్తానా, షా ఫర్హాన్, సయ్యద్ జిశాన్ ముస్తఫా, సుదర్శన్ రెడ్డి తదితరులు కోరారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >