| Daily భారత్
Logo




షాద్ నగర్ రెడ్డి మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

News

Posted on 2024-09-08 12:56:58

Share: Share


షాద్ నగర్ రెడ్డి మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

 మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఈ ప్రపంచానికి మార్గదర్శకులు గురువులేనని, గురువు లేనిదే సమాజంలో రాణించలేమని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో షాద్ నగర్ రెడ్డి మహిళా సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, అంగన్ వాడిలకు సన్మాన కార్యక్రమం  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ జడ్పీటిసి విశాల్ శ్రవణ్ రెడ్డి, వెంకట్ రాం రెడ్డి, ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్రపతి, శాస్ర్తవేత్తలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది ఎదిగిన వారు ఉన్నారని గుర్తు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ స్వీకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. మిగితా టీచర్లు వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసి వారు ఎంచుకున్న రంగంలో రాణించేలా టీచర్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. సామాజిక రుగ్మతలను పారద్రోల విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ అధ్యక్షురాలు అరుంధతి,రెడ్డి యువజన సంఘం అధ్యక్షుడు ఆశన్నగరి మధుకర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పి వెంకట రామిరెడ్డి, రవీందర్ రెడ్డి,సురేష్ రెడ్డి, దామోదర రెడ్డి లక్మి రెడ్డి, ఉమ రెడ్డి, మంజుల రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >