Posted on 2024-09-05 16:06:18
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, రెడ్డి సేవా సమితి నాయకులు
షాద్ నగర్ లో రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి కొత్వాల్ విగ్రహానికి శ్రీకారం
కార్యక్రమానికి హాజరైన వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు
గాంధీ, గద్దర్ తదితర విగ్రహాల ఏర్పాటు కూడా సుముఖత
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ, విద్యా వికాసానికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి కొత్వాల్ అని ఆయన సేవలను భవిష్యత్తు తరాలు స్మరించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనే ఉద్దేశంతో షాద్ నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్", మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, సీనియర్ నేత మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, విశాల శ్రావణ్ రెడ్డి, రెడ్డి సేవా సమితి షాద్ నగర్ అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి, యువజన సంఘం అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లట్టుపల్లి మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, పట్టణంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి కొత్వాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రభుత్వం తరఫున సహకరించేందుకు రెడ్డి సేవ సమితి నాయకులతో పాటు ఆయా ప్రజా సంఘాల నాయకులు జనార్ధన్ అర్జునప్ప బుచ్చయ్య రామకృష్ణ వెంకటయ్య తదితరులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పక్కనే ప్రజా నౌక గద్దర్ గాంధీ మహాత్ముని విగ్రహాలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే l శంకర్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి స్వార్థ చింతన లేకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తులను స్మరించుకోవడం ఎంతో గౌరవం అని అన్నారు. రెడ్డి సేవా సమితి ఏర్పాటు చేయ విగ్రహానికి ధనవంతు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి కొత్వాల్ (నేటి నగర పోలీస్ కమీషనర్ స్థాయి పదవి)గా పనిచేసిన రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి గొప్ప దాతగా, ప్రజాసంక్షేమానికి పాటుపడ్డ వ్యక్తిగా ప్రతిష్ఠ పొందారని అన్నారు. తెలంగాణలోని రెడ్డి కులస్తులైన విద్యార్థులతో పాటే సమాజంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే విధంగా చదువుకునేందుకు సహకారంగా ఉండాలని, ఆనాటి నైజాం రాష్ట్రంలో విద్యావికాసానికి ఉపకరిస్తుందని భూమి విరాళం ఇచ్చి రెడ్డి హాస్టల్‌ను ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. రెడ్డి హాస్టల్‌గా పేరుపొందిన హైదరాబాద్ రెడ్డి విద్యార్థి వసతిగృహం నిజాం పరిపాలనకాలం నాటి తెలంగాణలో విద్యారంగం, సాంస్కృతికరంగాలకు విలువైన సేవ చేసిన సంస్థ అని కొనియాడారు. హైదరాబాద్ నగర కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి రెడ్డి హాస్టల్‌ను తన వితరణతో ఏర్పాటుచేశారనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, తాండ్ర కాశినాథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు శ్యాంసుందర్ రెడ్డి విశాల శ్రావణ్ రెడ్డి, పి వెంకట్రామ్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, చెన్నయ్య, ఆగిర్ రవికుమార్ గుప్తా, సరాపు జగదీష్, చెంది తిరుపతి రెడ్డి, రఘు, ముబారక్ ఖాన్, రామారావు, బస్వం, మహమ్మద్ ఇబ్రహీం, ఖాదర్ గోరి, పురుషోత్తం రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,శేఖర్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి బడిరెడ్డి విజయ్ రెడ్డి ,అజయ్ రెడ్డి,అందేమోహన్, సయ్యద్ ఖదీర్, చంద్రశేఖర్, జమ్రుత్ ఖాన్, జంగారి రవి, లింగారెడ్డి గూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు..
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >
కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న
Posted On 2026-05-05 13:48:23
Readmore >
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >