| Daily భారత్
Logo




షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మహర్దశ : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-09-05 16:08:55

Share: Share


షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మహర్దశ : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాతలతో సమావేశం..

చందాల రూపంలో రూ. 25 లక్షలు వసూలు

ఐదు లక్షలు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, కాశీనాథ్ రెడ్డి చెరో అయిదు లక్షల విరాళం..

జర్నలిస్టులు, ప్రముఖులు, నాయకుల నుండి విరాళాల వెల్లువ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చిన్ని చిన్ని చినుకులే సెలయేళ్లుగా మారుతాయి.. ఒక్క రూపాయి రూపంలో వస్తువులయ్యే చందాలు లక్షలు, కోట్లుగా అవతరిస్తాయి.. అందుకే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వేశాడు అడుగు ముందుకు.. తాను చదివిన ప్రభుత్వ కళాశాలను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు.. ఇందులో భాగంగా నిర్వహించిన తొలి సమావేశంలోనే రూ. 25 లక్షలు విరాళాల రూపంలో వసూలు కావడం విశేషం.

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కాశీనాథ్ రెడ్డి చెరో అయిదు లక్షల చొప్పున ప్రకటించడమే కాకుండా కళాశాల నిర్మాణం జరిగే వరకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను సత్కరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనంతరం కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా అధ్యాపకులను ముందుగా సత్కరించిన ఆయన అనంతరం కళాశాల అభివృద్ధికి తాము చేయబోయే కార్యక్రమానికి విరాళాలు ఇవ్వవలసిందిగా అక్కడ హాజరైన నేతలను కోరారు. నేతలు ఎం.డి ఖాదర్ గోరి, మహ్మద్ ఇబ్రహీం తదితరులు లక్ష రూపాయలు ప్రకటించగా, రూపాయలు 500 తో మొదలుపెట్టి 20వేల వరకు చాలామంది ప్రకటించారు. మరికొందరు త్వరలో ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. దీనితో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే దిశగా తొలి అడుగు పడింది. దాతల ఔదార్యంపై వీర్లపల్లి శంకర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర రంగాలలో ఉన్న పెద్దలతో విడతల వారీగా సమావేశం ఏర్పాటు చేసి వారి ద్వారా విరాళాలు సేకరించి కళాశాలను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు.

టార్గెట్ జనవరి..

ఈ కళాశాల నిర్మాణానికి సంబంధించి గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాలలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఒక మోడల్ కాలేజీగా ఈ కళాశాలను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అయితే కళాశాలలో ప్రస్తుతం సత్వరమే పరిష్కరించాల్సిన సమస్యల గురించి ప్రిన్సిపల్ తనకు వివరించారని ఆ సమస్యలను వెంటనే నెరవేరిచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కళాశాల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిధుల కోసం పెట్టుకుంటే జాప్యం జరుగుతుందని, అందుకే పూర్వ విద్యార్థులందరినీ ఏకం చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రతివారం ఓ సమావేశం నిర్వహించడం ద్వారా ముందుకు వెళ్తామని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉంటారని వివరించారు. కళాశాలకు సంబంధించి మోడల్ కూడా తయారు చేశామని, ఆర్కిటెక్ పరిశీలన తర్వాత ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మించాలి అన్నది ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులలోనూ రాజీ లేకుండా కళాశాల నిర్మాణాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని, ముఖ్యమైన కళాశాల అభివృద్ధి కమిటీలను కూడా నియమిస్తున్నట్టు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు మేధావులు తదితరులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారుఈ సందర్భంగా స్పష్టం చేశాఅండగా ఉంటాం..

కళాశాల నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అన్ని విధాల అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ కళాశాల నిర్మాణ బాధ్యతను అంకిత భావంతో పూర్తి చేయగల సమర్థత శంకర్ కు ఉందని, ముఖ్యమంత్రితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వివరించారు. కళాశాల బాధ్యత మేము చూసుకుంటాం.. మీరు విద్యార్థులంతా బాగా చదివి మంచి ఫలితాలు సాధించి కళాశాలను నెంబర్ వన్ గా నిలపాలి. అప్పుడే మా అందరి ప్రయత్నానికి సార్ధకత చేకూరుతుందని విద్యార్థులకు ఆయన వివరించారు. జడ్పిటిసి విశాల మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులను చూస్తుంటే ముచ్చటేస్తుందని, మంచి క్రమశిక్షణతో వారు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వారి క్రమశిక్షణను బట్టి అధ్యాపకులు ఎంత బాగా చెబుతున్నారో అర్థమవుతుందన్నారు. కళాశాలకు సంబంధించి పెద్ద మొత్తంలో విరాళం ఇస్తానని త్వరలోనే ప్రకటిస్తానని ఆమె వివరించారు. కళాశాల అభివృద్ధి కోసం లక్ష రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు జడ్పిటిసి వెంకటరామిరెడ్డి తెలిపారు. మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా అసెంబ్లీ పరిధిలో విద్యాలయాలను అభివృద్ధి చేయడం సంకల్పంగా పెట్టుకున్నారని అన్నారు. ఈ సంకల్పానికి తన సహకారం అన్నివేళలా ఉంటుందని వివరించారు. నేతలు చెంది తిరుపతిరెడ్డి, కొంకళ్ళ చెన్నయ్య, చల్లా శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, రఘు, జమ్రుద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.రు.

అండగా ఉంటాం..

కళాశాల నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అన్ని విధాల అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ కళాశాల నిర్మాణ బాధ్యతను అంకిత భావంతో పూర్తి చేయగల సమర్థత శంకర్ కు ఉందని, ముఖ్యమంత్రితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వివరించారు. కళాశాల బాధ్యత మేము చూసుకుంటాం.. మీరు విద్యార్థులంతా బాగా చదివి మంచి ఫలితాలు సాధించి కళాశాలను నెంబర్ వన్ గా నిలపాలి. అప్పుడే మా అందరి ప్రయత్నానికి సార్ధకత చేకూరుతుందని విద్యార్థులకు ఆయన వివరించారు. జడ్పిటిసి విశాల మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులను చూస్తుంటే ముచ్చటేస్తుందని, మంచి క్రమశిక్షణతో వారు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వారి క్రమశిక్షణను బట్టి అధ్యాపకులు ఎంత బాగా చెబుతున్నారో అర్థమవుతుందన్నారు. కళాశాలకు సంబంధించి పెద్ద మొత్తంలో విరాళం ఇస్తానని త్వరలోనే ప్రకటిస్తానని ఆమె వివరించారు. కళాశాల అభివృద్ధి కోసం లక్ష రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు జడ్పిటిసి వెంకటరామిరెడ్డి తెలిపారు. మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా అసెంబ్లీ పరిధిలో విద్యాలయాలను అభివృద్ధి చేయడం సంకల్పంగా పెట్టుకున్నారని అన్నారు. ఈ సంకల్పానికి తన సహకారం అన్నివేళలా ఉంటుందని వివరించారు. 

మీడియా సహకారం..

మీడియా సహకారంతోనే కళాశాల అభివృద్ధి నూతన భవన నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ నిర్మాణంలో సీనియర్ జర్నలిస్టు ఖాజాపాషా కెపి 21 వేలు, ఏబీఎన్ చందు 5116, రంగనాథ్ 500, ఇలియాస్ 5116 రూపాయలను విరాళాలుగా ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, తాండ్ర కాశినాథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు శ్యాంసుందర్ రెడ్డి విశాల శ్రావణ్ రెడ్డి, పి వెంకట్రామ్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, చెన్నయ్య, ఆగిర్ రవికుమార్ గుప్తా, సరాపు జగదీష్, చెంది తిరుపతి రెడ్డి, రఘు, ముబారక్ ఖాన్, రామారావు, బస్వం, మహమ్మద్ ఇబ్రహీం, ఖాదర్ గోరి, పురుషోత్తం రెడ్డి, సురేష్ రెడ్డి, అందేమోహన్, సయ్యద్ ఖదీర్, చంద్రశేఖర్, జమ్రుత్ ఖాన్, జంగారి రవి, లింగారెడ్డి గూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >