Posted on 2026-05-05 10:18:23
డైలీ భారత్, కామారెడ్డి: కేరళ రాష్ట్రంలోని అడూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్వకేట్ సి.వి.శాంత కుమార్ 10,300 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించడం ప్రజాస్వామ్య విలువలకు, అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అడూర్ నియోజకవర్గానికి వెళ్లిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నెల రోజుల పాటు అక్కడే మకాం వేసి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికల వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేశారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
అడూర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ మరియు మహిళా శ్రేణులు ఇచ్చిన అపూర్వమైన సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని ఎమ్మెల్యే తెలిపారు. జుక్కల్ ప్రజల తరఫున అడూర్ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “తెలంగాణ – కేరళ ప్రజల మధ్య ఉన్న ప్రేమాభిమానాలకు ఈ విజయం నిదర్శనం” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడ అవసరం వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉంటానని తోట లక్ష్మీకాంతరావు స్పష్టం చేశారు. అడూర్ విజయంలో ఆయన చూపిన అంకితభావం, కష్టపడి పనిచేసిన తీరు పట్ల పార్టీ వర్గాలు ప్రత్యేకంగా అభినందిస్తున్నాయి.
“కాంతన్న పట్టింది బంగారమే” అంటూ జుక్కల్ మరియు అడూర్ కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జుక్కల్ పేరు మారుమోగేలా చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు భవిష్యత్తులో పార్టీ అధిష్టానం మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొత్తానికి కేరళలో కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేసిన కృషి విశేషమని కాంగ్రెస్ నాయకులు కొనియాడుతున్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >