| Daily భారత్
Logo




తండ్రీకొడుకును మింగేసిన బుడమేరు వరద

News

Posted on 2024-09-03 08:48:25

Share: Share


తండ్రీకొడుకును మింగేసిన బుడమేరు వరద

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బుడమేరు వరద విజయవాడ ప్రజల జీవితాల్లో విషాదాన్ని నింపింది. దాని ఉద్ధృతికి తండ్రీకొడుకు దుర్మరణం పాలయ్యారు. గుణదలలోని విజయనగర్ కాలనీకి చెందిన కొల్లిపర వెంకటేశ్వరరావు(63), ఆయన కుమారుడు సందీప్(35) ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అక్కడికి వెళ్లినవారు సోమవారం ఉదయానికీ ఇంటికి రాలేదు. అనుమానంతో కుటుంబసభ్యులు అక్కడికెళ్లి చూడగా వరద నీటిలో వారిద్దరి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు వచ్చి వారి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఘటనలో గొల్లపూడి నల్లకుంట సెంటర్‌ వద్ద కాలువలో గుర్తుతెలియని మహిళ (55) మృతదేహం కొట్టుకొస్తుండగా, స్థానికులు గమనించి ఒడ్డుకు తీసుకువచ్చారు.

తెలంగాణలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మ‌రిపెడ మండ‌లం పురుషోత్తమాయ‌గూడెం వ‌ద్ద ఆకేరు వాగులో గ‌ల్లంతైన నూనావ‌త్ మోతీలాల్ మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఆదివారం ఉద‌యం వాగులో కారు కొట్టుకుపోయిన ఘ‌ట‌న‌లో తండ్రీకూతురు గ‌ల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రం బిడ్డ అశ్విని మృత‌దేహం ల‌భ్యంకాగా, నిన్న తండ్రి మోతీలాల్ మృత‌దేహాన్ని రెస్క్యూ టీం వారు గుర్తించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంకాగా, స్థానికుల‌ను కంట‌త‌డిపెట్టించింది.

బిడ్డ అశ్వినిని శంషాబాద్ విమానాశ్రయంలో దింపేందుకు ఖ‌మ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి శివారు గంగారంతండా నుండి నిన్న తెల్లవారుజామున కారును తానే నడుపుతూ ఆనందంగా బయలుదేరాడు మోతిలాల్. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిపైనుంచి ఆకేరు వాగు ఉధృతంగా పోతుండటంతో వరద తీవ్రతను గుర్తించ‌క అలాగే ముందుకెళ్లాడు. దీంతో వారు ప్ర‌యాణిస్తున్న కారు వాగులో కొట్టుకుపోయింది.

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >