| Daily భారత్
Logo




మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్

News

Posted on 2024-09-03 08:46:01

Share: Share


మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్

రూ.52 లక్షలు దారిమళ్లించిన కాంట్రాక్టు ఉద్యోగి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల సంతకాలను పోర రీ చేసిన ఓ ఉద్యోగి ఏకంగా 52 లక్షల వర్సిటీ నిధులను దారి మళ్లించాడు. వర్సిటీ ఆడిట్ లో విషయం వెలుగుచూడగా, యూనివర్సిటీ ఉన్నతాధికారులు రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం... గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి గత సంవత్సరం క్రితం కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. అకౌంట్స్ సెక్షన్ లో పనిచేస్తున్న జాకీర్ హుస్సేన్ ఉర్దూ యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్ లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని భారీ కుట్రకు తెరలేపాడు. ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి ఏకంగా 52లక్షల రూపాయల నిధులను తన ఖాతాకు మళ్లించాడు. ఇటీవల జరిపిన ఆడిట్ లో ఈ కుట్రను యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో జాకీర్ హుస్సేన్ ఈ కుట్రకు పాల్పడినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. అనంతరం నిధుల గోల్ మాల్ విషయమై రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా లక్షల రూపాయల నిధులను పక్కదారి పట్టించిన జాకీర్ హుస్సేన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >