Posted on 2023-11-07 19:24:08
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మర్డర్ మిస్టరీ
డైలీ భారత్, సిరిసిల్ల :అనుమానంతో వేధిస్తున్నాడని ఇంటి పెద్దను భార్య, కూతురు గొంతు కోసి హతమార్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల పట్టణ సిఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం. సిరిసిల్ల పట్టణం శివనగర్ చెందిన లేచర్ల ప్రకాష్ రావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడని, ప్రకాష్ రావు అంత్యక్రియలు కూడా అనుమానాస్పదంగా జరిపారని ఈనెల నాలుగవ తేదీన శాంతి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరపగా ప్రకాష్ రావు జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ తన భార్య స్వప్న, తన కూతురు ఉషశ్రీ లను అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ నిరంతరం అనుమానిస్తూ ఉన్నాడని, ఎలాగైనా తనను అడ్డు తొలగించుకోవాలని ఈనెల ఒకటవ తేదీ అద్దరాత్రి ప్రకాష్ రావు నిద్రిస్తున్న సమయంలో కూతురు దిండుతో ముఖంపై నిమురగా, భార్య కత్తితో గొంతు కోసి హతమార్చినట్లు తెలిపారు. ప్రకాష్ రావు మృతదేహాన్ని కత్తులతో గోడ్డలతో ముక్కలుగా చేసి వేరే ప్రదేశాలకు తరలించాలని, మృతదేహాన్ని ఇంటిలోనే గొయ్యి తీసి పాతి పెట్టాలని చూడగా రెండు ప్రయత్నాలు విఫలం కావడంతో ఇంటిలోనే పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పారు. మృతదేహం పూర్తిగా కాలక పోవడంతో దుర్వాసన రావడం వల్ల ఈనెల 4న బంధువుల సహాయంతో వారు మృతదేహాన్ని ఖననం చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాష్ రావుని తన భార్య, కూతురు హత్య చేసినట్లుగా వెళ్లడైందని, నిందితుల వద్ద హత్యకు ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకొని, రిమైండ్ కి పంపినట్లు పట్టణ సీఐ ఉపేందర్ తెలిపారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >