Posted on 2023-11-07 14:26:17
17వ పోలీస్ బెటాలియన్ ను సందర్శించిన డి.ఐ.జి యమ్.యస్.సిద్దిఖీ .
డైలీ భారత్, సిరిసిల్ల : ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస రావు డి.ఐ.జి యమ్.యస్.సిద్దిఖీ, టి.ఎస్.ఎస్.పి బెటాలియన్స్ గారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వచ్చిన డీ.ఐ.జీ సిద్ధిఖీ బెటాలియన్ లో విస్తృతంగా పర్యటించి పర్యవేక్షించారు. పరిపాలన ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి మినిస్టీరియల్ స్టాఫ్ కు సంబంధించిన విభాగాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బెటాలియన్ కు సంబంధించిన యూనిట్ హాస్పిటల్,మోటార్ ట్రాన్స్పోర్ట్, బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీస్, క్వార్టర్ మాస్టర్ ఆఫీస్ వింగ్ ల యొక్క వివిధ రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన గాడ్ రూమును ప్రారంభించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు.నిర్మాణంలో ఉన్న పరిపాలన భవనాన్ని మరియు బెల్ ఆఫ్ ఆర్మ్స్ భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ వార్షిక తనిఖిలో భాగంగా డి.ఐ.జి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారని మరియు అధికారులు మరియు సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ. జయప్రకాష్ నారాయణ ,యమ్.పార్థసారథి రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.శైలజ ,అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >