Posted on 2023-11-07 16:10:03
డైలీ భారత్, సిరిసిల్ల: బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని ఆరు నెలల వ్యవధిలోనే తెలిసిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చక్రధర్ రెడ్డి అన్నారు. సోమవారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, మంగళవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు తాను సుపరిచితున్ని అని, బిఆర్ఎస్ అరాచక పాలనను అంతం చేయాలని బిజెపిలో చేరినట్లు తెలిపారు. కానీ ఆరు నెలల వ్యవధిలోనే బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని తెలిసిందన్నారు. బండి సంజయ్ పిలుపు మేరకు పార్టీలో చేరిన తనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పదవి ఇచ్చినా, పార్టీలో మాత్రం సమషిత న్యాయం జరగలేదని విమర్శించారు. అవినీతికి పాల్పడ్డ వారికి శిక్ష ఎందుకు పడలేదని బిజెపి పేద నేతలను నిలదీశామన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, బిఆర్ఎస్ అంతం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. రాహుల్ గాందీ న్యాయకత్వంలో తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం జరుగుతుందన్నారు. కేకే మహేందర్ రెడ్డి నిస్వార్థ నాయకుడని, ఎంతో మంది టికెట్టు అడిగిన కేకే మాత్రమే కేటీఆర్ కు గట్టి పోటీ అని నమ్మి అధిష్టానం కెకెకు టికెట్టు ఇచ్చిందన్నారు. పార్టీలో చేరి సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >