| Daily భారత్
Logo




బహుజన బిడ్డ సరితమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి - రేవంత్ రెడ్డి.

News

Posted on 2023-11-07 19:39:00

Share: Share


బహుజన బిడ్డ సరితమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి - రేవంత్ రెడ్డి.

వాల్మీకి బోయ లకు ఎస్టీ జాబితాలో చోటు కల్పిస్తామన్నారు.

బారీ ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు.

గద్వాల ప్రజా గర్జన సభలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

ఆశీర్వదించమని వేడుకున్న కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ...

ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తాం.

డైలీ భారత్, గద్వాల: పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి విమర్శించారు. గద్వాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఈ ప్రాంతాన్ని కేసీఆర్ సంపూర్ణంగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. మేము నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతానికి కష్టాలు వచ్చాయా కేసీఆర్ అంటూ రేవంత్ ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను ఆదుకుంది కాంగ్రెస్సేనని ఆయన అన్నారు. కేసీఆర్ చేసిందేమీ లేక అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. మీరు 24 గంటలు కరెంటు ఇచ్చినట్టు నిరూపిస్తే మేం నామినేషన్లు వేయమని.. లేకపోతే మీరు గద్వాల చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి, బకాయిలు తొలగించి, కేసులు ఎత్తివేశామన్నారు. 18లక్షల పంపుసెట్లకు ఉచిత కరెంటు అందించామన్నారు. నిజంగా కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఉంటే.. తెలంగాణలో పంపుసెట్లు 18 లక్షల నుంచి 25 లక్షలకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. రేవంత్ మాట్లాడుతూ.. “బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే సరిత తిరుపతయ్యకు టికెట్ ఇచ్చాం. కాంగ్రెస్ గెలిస్తేనే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ వస్తుంది.. ఆరు గ్యారంటీలను ఆమలు చేసి తీరుతుంది.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ మహిళకు చేయూతను అందిస్తాం. కేసీఆర్ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్ అని ప్రజలు అంటున్నారు. అందుకే ధరణి, 24గంటల కరెంటు విషయంలో కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ధరణి కంటే మెరుగైన సాంకేతికత తీసుకొచ్చి రైతుల భూములను కాపాడుతాం. రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15వేలు,రైతు కూలీలకు రూ.12వేలు అందిస్తా. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు… ప్రతీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం. ఎవరూ బిల్లులు కట్టకండి.. వచ్చే నెల కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది.” అని రేవంత్‌ పేర్కొన్నారు... 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి మల్లు రవి,నాగర్ కర్నూల్ పార్లమెంటరీ అబ్జర్వర్ ఏఐసిసి కార్యదర్శి పి.వి.మోహన్, జూపల్లి కృష్ణారావు, మెగా రెడ్డి,బండ్ల లక్ష్మీదేవి చంద్రశేఖర్ రెడ్డి, గంజిపేట్ శంకర్,నల్లారెడ్డి, మధుసూదన్ బాబు,ఇషాక్,వరలక్ష్మి వెంకటస్వామి గౌడ్,ఎంపిపి నజ్మూనిస బేగం,ధనలక్ష్మి కృష్ణమూర్తి,గట్టు కృష్ణ,సత్యనారాయణ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటీసిలు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు...

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >