Posted on 2024-08-07 18:01:16
ఏబీవీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మానవ సేవయే మాధవ సేవ అని అన్ని విధాలుగా నిజాయితీగా సేవా అందించిన నాడే సమాజంలో ఆరోగ్యం సిద్ధిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలంలోని హాజీపల్లి గ్రామంలో ఏబీవీ హాస్పిటల్ డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కష్టకాలంలో హాస్పిటల్ కి వచ్చే పేదలకు భరోసా ఇచ్చి మానవతా దృక్పథంతో వైద్యం చేయాలని సూచించారు. ఓపికతో సేవ చేస్తే వైద్య రంగంలో మంచి స్థానానికి ఎదగవచ్చని పేర్కొన్నారు. డబ్బు లాభాపేక్షతో సేవలు చేయవద్దని పేదలకు నాణ్యమైన వైద్యం అందించినప్పుడే బాగుంటుందని అన్నారు. రోగిని మంచి మాటలతో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని అన్నారు. విశ్వాసమే వైద్యానికి బలం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ కుమార్, భార్గవి దంపతులు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సేవలో భాగంగా ఏబీవీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలను ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు వారు పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్, ఎంపీటీసీల సంఘం నాయకులు శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ సుదర్శన్, నర్సప్ప మాజీ సర్పంచ్ కృష్ణ, కమ్మదనం నవీన్, విష్ణు హాస్పిటల్ యజమాన్యం, మరియు సిబ్బంది పాల్గొన్నారు..
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >