| Daily భారత్
Logo




ఉస్మానియా యూనివర్సిటికీ కొత్త వీసీ నియామకం తర్వాతనే టెండర్లు నిర్వహించాలి

News

Posted on 2024-08-07 18:18:44

Share: Share


ఉస్మానియా యూనివర్సిటికీ కొత్త వీసీ నియామకం తర్వాతనే టెండర్లు నిర్వహించాలి

పాత టెండర్ల కమిటీ ని రద్దు చేసి కొత్త కమిటీ వేయాలి

టెండర్లను నాన్ లోకల్ ఎజెన్సీల కు వ్యక్తులకు కాకుండా అర్హులైన స్థానికులకే కేటాయించాలి

ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మైన్ కొత్తపల్లి తిరుపతి డిమాండ్

డైలీ భారత్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో టెండర్ల ద్వారా వివిధ పనులు హౌస్ కీపింగ్, ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ విభాగాలలో పనులు చేపట్టేందుకు యూనివర్సిటీ పలు ఎజెన్సీలకు టెండర్లను నిర్వహించి వారికి పనులను అప్పజెప్పుతారు. కానీ ఈ టెండర్ విధానంలోనే అసలు లోపాలునున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ లో చేపట్టే టెండర్లు  అన్ని విధాలుగా అర్హతలు కలిగిన స్థానిక అభ్యర్థులను,  ఎజెన్సీలను కాదని యూనివర్సిటీ ఉన్నతాధికారులు కొందరు కమీషన్ల కు కక్కుర్తి పడి  నాన్ లోకల్ ఎజెన్సీలకు అభ్యర్థులకు టెండర్లను కేటాయిస్తున్నారు. ఇప్పుడున్న ఈ కమిటీలో బిఅరెస్ పార్టీకి అనుకూలమైన వారు ఉన్నారు. అందువలన ఈ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ వేయాలి. ఇదంతా యూనివర్సిటీ కి కొత్త వీసీ వచ్చిన తర్వాతనే ఈ ప్రక్రియ మొత్తం చేపట్టాలి. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఏజెన్సీ లు మరియు వ్యక్తులను యూనివర్సిటీ యాజమాన్యం  అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. ఇప్పటికైనా యూనివర్సిటీ వైఖరిలో మార్పు రావాలని స్థానికులకే అవకాశాలు దక్కేలా చూడాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి యూనివర్సిటీ అధికారులను కోరారు. ప్రస్తుతం ఈ విబాగాలలో పని చేస్తున్న టెండర్ ఏజెన్సీలు అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో పని చేసే కార్మికులకు ఏమి జరిగిన కనీసం వారి బాగోగులను కూడా పట్టించుకోకపోవడం లేదని సమయానికి కార్మికుల కు సరిగా జీతాలు కూడా చెల్లించడం లేదనే ఆరోపలు కూడా ఉన్నాయి అని అన్నారు. అందువలన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ గా డిమాండ్ చేసేదేమంటే 1 కొత్త వీసీ నియామకం తర్వాతనే టెండర్ల ను నిర్వహించాలి   2 యూనివర్సిటీ పాత టెండర్ల కమిటీ ని వెంటనే రద్దు చేయాలి. 3  టెండర్ల నిర్వహణకు  కొత్త కమిటీ వేయాలి 4  నాన్ లోకల్ ఏజెన్సీ లు వ్యక్తులకు కాకుండా అర్హులైన స్థానిక ఏజెన్సీ లు మరియు వ్యక్తులకే టెండర్ల ను కేటాయించాలి. 5 టెండర్ల ను పారదర్శకంగా నిర్వహించాలి

ఈ కార్యక్రమంలో రమేష్, శ్రీనివాస్, శివ, లక్ష్మణ్, జోష్, కమలాకర్, రాజు, ప్రశాంత్, మహేష్, అంజి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >