| Daily భారత్
Logo




మానవ అక్రమ రవాణా నిర్ములించడం అందరి బాధ్యత

News

Posted on 2024-08-07 13:58:33

Share: Share


మానవ అక్రమ రవాణా నిర్ములించడం అందరి బాధ్యత

మున్సిపల్ కమీషనర్ వెంకన్న, సిడీపిఓ నాగమణి, ప్రజ్వల సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మనుషుల అక్రమ రవాణా నిర్ములనతో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చని షాద్ నగర్ మున్సిపల్ కమీషనర్ వెంకన్న సీడీపీఓ నాగమణి ప్రజ్వల స్వచ్చంద సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్  బలరామ కృష్ణ అన్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ షాద్ నగర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ కి నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ  కార్యక్రమం స్థానిక మున్సిపల్ ఆఫీస్ షాద్ నగర్ నందు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కమీషనర్ వెంకన్న మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది  ప్రపంచం లోనే అతిపెద్ద నేరం అని, ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు మహిళలు దీని బారిన పడుతున్నారు, ముక్యంగా పేద మధ్య తరగతి వారు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి, సినిమా అవకాశాల పేరుతో మోసాలకు గురి అవుతున్నారు, ప్రతి ఒక్కరు దీనిపై అవగాహనా పెంచుకొని అప్రమతంగా ఉండాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ టీచర్ తమ పరిధిలోని మహిళలకు, అమ్మాయిలకు అక్రమ రవాణా పై అవగాహనా కల్పించాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇది మానవతా దృక్పతం తో చేయాలనీ, దీని వలన చాలా మంది అమ్మాయిలు రక్షింప బడతారు అని అన్నారు. సీడీపీఓ నాగమణి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా పై నిర్వహిస్తున్న ఈ శిక్షణను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను నిర్ములించే ఉదేశ్యం తో ఇస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని, గ్రామాలలో అన్ని వర్గాల వారికి అవగాహనా కల్పిస్తూ అప్రమతం చేయాలనీ, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేయాలనీ అన్నారు. 

ప్రజ్వల స్వచ్చంద సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నిర్ములన కొరకు ప్రజ్వల సంస్థ గత 28 సంవత్సరాలనుండి లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా పనిచేస్తు 28,600 మంది అమ్మాయిలను కాపాడి పునరావాసం కల్పించడం జరిగింది. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్ సునీత కృష్ణన్ గారు సంబంధిత ఐసీడీఎస్, పోలీస్, జ్యుడీషియల్, ఎడ్యుకేషన్, డీఆర్ డీఏ డిపార్ట్మెంట్ల సహకారంతో పని చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లలోని అంగన్వాడీ టీచర్ లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా గ్రామాలలో అవగాహనా కార్యక్రమాలను నిరహించేలా చేస్తూ ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను ఎలా సంప్రదించలో ఈ శిక్షణలో నేర్చుకోవడం జరుగుతుంది 

శిక్షణ తో భాగంగా మానవ అక్రమ రవాణా ఎలా జరుగుతుంది, ఎవరు దీనికి గురి అవుతారు, లైంగిక వ్యాపారం లోకి వెళ్లిన అమ్మాయిల పరిస్థితులు ఎలావుంటాయి మరియు సైబర్ ట్రాఫికింగ్ (ఆన్లైన్ మోసాలు) వివరిస్తూ ప్రతి గ్రామంలో సమాజ జాగృతి సంఘాలను ఏర్పాటు చేసి,వారి ద్వారా అక్రమ రవాణా సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని మరియు ప్రతి ఒక్కరు ఈ విషయాలపట్ల అప్రమతంగా ఉండాలని అన్నారు.


ఈ శిక్షణ కార్యక్రమం లో మున్సిపల్ మేనేజర్ నయీమ్ పాషా, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు అండాలు, సంధ్య, విజయ మరియు ప్రజ్వల ప్రతినిధులు సురేష్ కుమార్, అనిల్ కుమార్, మితాళి రాజ్ మరియు మండలం లోని అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు...

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >