| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్వచ్ఛదనం - పచ్చదనం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి: కౌన్సిలర్ నడికూడసరిత యాదగిరి యాదవ్

స్వచ్ఛదనం - పచ్చదనం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి: కౌన్సిలర్ నడికూడసరిత యాదగిరి యాదవ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం 22వ వార్డులో ఈరోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక వార్డు కౌన్సిలర్ నడికూడ సరిత యాదగిరి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మన పరిసరాలను మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా సీజన్ వ్యాధులు మరియు డెంగు, మలేరియా, అతిసారం వంటి రోగాల బారిన పడకుండా  మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా చెట్లని నాటి, మన పిల్లలకు, మనకు  స్వచ్ఛమైన ఆక్సిజన్ ను ఆస్వాదించేటువంటి గొప్ప అవకాశం ఉంటుందని,కావున ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటి స్వచ్ఛతనంతో- పచ్చదనంతో ఉండేందుకు కృషి చేయాలని కౌన్సిలర్లు కూడా సరదా యాదగిరి యాదవ్ పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో వాడు స్పెషల్ ఆఫీసర్ భాస్కర్, మల్లమ్మ మేడం,  కాలనీవాసులు  నడి కూడా యాదగిరి యాదవ్, నరసింహులు యాదవ్, రాములు ముదిరాజ్, బాలస్వామి, వెంకటయ్య, జవాన్ మల్లేష్,మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు..

Previous జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారుల సన్మానం
Next మానవ అక్రమ రవాణా నిర్ములించడం అందరి బాధ్యత
ADVERTISEMENT