| Daily భారత్
Logo




ప్రియాంక హాస్పిటల్ నిర్లక్ష్యంతో బాలింత మృతి

News

Posted on 2024-08-06 18:57:57

Share: Share


ప్రియాంక హాస్పిటల్ నిర్లక్ష్యంతో బాలింత మృతి

ప్రియాంక హాస్పిటల్ ముందుధర్నా రాస్తారోకో హాస్పటల్ సీలు చేయాలి

డైలీ భారత్, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్‌లో నివాసం ఉంటున్న సాయిశ్వర్ తన కూతురు కావ్య గర్భం దాల్చడంతో తన తల్లిగారిల్లు అయిన నాగర్ కర్నూల్‌లో ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో పట్టణంలోని ప్రియాంక హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు సర్జరీ చేయగా.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పారు.

ఆ ఆనంద క్షణాలను బంధువులతో పంచుకునే లోపే సాయంత్రం కావ్యకు సీరియస్‌గా ఉంది హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు.

వెంటనే అంబులెన్స్‌లో హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గత రెండు నెలల క్రితం తాడూరుకు చెందిన పద్మ పురిటి నొప్పులతో వస్తే నర్స్‌తో ఇంజక్షన్ వేయించడంతో అది వికటించి మృతి చెందింది. దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేసి జరిమానా విధించారు.

నెల క్రితం తెరుచుకున్న ఆస్పత్రి మరో మృతికి కారణమవడం శోచనీయం. ఫైన్ వేసి సీజ్ చేసిన ఆసుపత్రి తీరు మారడం లేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. కావ్య పుట్టిన మగ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >