Posted on 2024-08-06 18:50:24
తెలంగాణ భవన్ లో ప్రొఫెసర్ జయశంకర్ వేడుకల్లో హాజరైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా.. ఎన్ని ఆటు పోట్లు ఎదురొచ్చినా.. ఎన్నెన్నో కుట్రల కత్తులు దూసినా..వెన్ను చూపలేదనీ వెనకడుగు వేయలేదనీ
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ హైదరాబాద్ లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొదట ఒంటరైనా తన గళం విప్పారనీ ఎలుగెత్తిన నినాదం ఆపలేదని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర కలల జెండాను.. భవిష్యత్ అజెండాను వదలలేదనీ తెలంగాణే శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. తెలంగాణ లక్ష్యంగా బతికారని కొనియాడారు. కోట్లాది సకల జనుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారనీ సాకారం అయ్యేదాకా బతికించారన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్వరాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. తన జీవితం అంకితం చేసిన పోరాట యోధుడని ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ప్రజలను ముందుకు నడిపారన్నారు.
ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నిత్యనూతనంగా ఊపిరిలూదారని తెలంగాణ గుండెలో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఆయన నిరంతర కృషి, దృఢసంకల్పాన్ని ఎన్నటికీ మరువరని స్వరాష్ట్ర పోరులో ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా సార్ ప్రస్థానం అంచలంచెలుగా కొనసాగించారన్నారు. మొత్తంగా తెలంగాణ స్వరాష్ట్ర కలకు దిక్సూచిగా నిలిచారన్నారు. దశాబ్దాల స్వరాష్ట్ర భావజాలం వ్యాపింపజేశారన్నారు. భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా తన సంకల్పబలంతో నిర్విరామంగా అలుపెరుగని పోరు సాగించారన్నారు. ఎప్పటికప్పుడు తన ఆశయాలు, ఆలోచనలకు పదును పెడుతూ, స్వరాష్ట్ర సాధనకు ఆయువుపట్టుగా నిలిచారనీ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు..
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >