| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో షాద్ నగర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం  స్థానిక కౌన్సిలర్ నడి కూడా సరితా యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు రతన్ కాలనీ, అంజయ్య కాలనీలలో 25 లక్షల మున్సిపాలిటీ సాధారణ నిధులతో  సిసి రోడ్లు, ఓపెన్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకర్  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే  షాద్ నగర్  మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయించి, అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఏఈ రాయుడు,  కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, చెన్నయ్య, తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్, దంగు శ్రీనివాస్ యాదవ్ , రాజేందర్ రెడ్డి, నడికూడ యాదగిరి యాదవ్, రాములు ముదిరాజ్, బస్వం, విజయ్ కుమార్, శ్రీశైలం గౌడ్, నరసింహులు యాదవ్, ఆలీ, ప్రవీణ్, పైలయ్య, నల్లమోని శ్రీధర్, అర్జున్ లక్ష్మణ్, రమేష్, స్పెషల్ ఆఫీసర్ భాస్కర్,  అనురాధ కాలనీవాసులు పాల్గొన్నారు.

Previous జయశంకర్ సార్ ఆశించిన తెలంగాణా రాబోతుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next అందరి హృదయాల్లో చెరగని ముద్ర ప్రొఫెసర్ జయశంకర్ : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ADVERTISEMENT