| Daily భారత్
Logo




జయశంకర్ సార్ ఆశించిన తెలంగాణా రాబోతుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-08-06 18:48:44

Share: Share


జయశంకర్ సార్ ఆశించిన తెలంగాణా రాబోతుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

దోచుకుని... దాచుకున్నారు..!

దాష్టికాలు చేసి సత్య హరిశ్చంద్రుల్లా పలుకులా..

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణా ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల కాలంలో గత పాలకులు తెలంగాణా రాష్ర్ట ప్రజలను అష్ట కష్టాలపాలు చేసి వారిని అడ్డంగా దోచుకుని దాచుకున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వెనక పోయిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాటం సాగిస్తానని ఆజన్మ బ్రహ్మచారిగా నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని గుర్తు చేశారు. ఇలాంటి ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాదించిన ప్రత్యేక రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసిన వారంతా నేడు సత్య హరిచంద్రుల్లా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. నిజమైన ఉద్యమకారుల ఆశయాలు నెరవేర్చే విదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అదే దారిలో ముందుకు సాగుతున్నమన్నారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం జనార్ధన్, బాదేపల్లి సిద్ధార్థ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షులు కొంకళ్ళ చెన్నయ్య, పీసీసీ సభ్యులు మహమ్మద్ అలీఖాన్ బాబర్, ఐఎన్టీయూసి రాష్ట్ర కార్యదర్శి రఘు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, ఫరూక్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జెఎసి నాయకులు కరుణాకర్ , టి.ఎల్.ఎఫ్, వి రామారావు, ఈ.పాండు, మందారం నరసింహులు ,  కర్ణ కోల రవీంద్రనాథ్,  జి.రాము, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి, శివ నాగయ్య, స్వరాజ్ బాబు,  అబ్దుల్  గపూర్,  సత్యనారాయణ గౌడ్ , అనిల్ కుమార్, బుచ్చయ్య,  నాగరాజు , విజయ్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >