Posted on 2024-08-05 16:28:57
నియోజకవర్గానికి రూ. 1కోటి 22లక్షల 74వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు
ఫరూక్ నగర్, చౌదరిగుడా కొందుర్గు, షాద్ నగర్ పట్టణంలో 376 మంది లబ్ధిదారులు
210 మంది లబ్ధిదారులకు షాద్ నగర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అన్ని విధాల నిర్వీర్యం చేసిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
210 మంది లబ్ధిదారుల కోసం 68 లక్షల 81 వేల రూపాయల చెక్కులను ప్రస్తుతం అందజేసినట్టు ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్, చౌదరిగుడా కొందుర్గు, షాద్ నగర్ పట్టణంలో 376 మంది లబ్ధిదారులకు రూ. 1కోటి 22లక్షల 74వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చాయని వీటిలో 210 మంది లబ్ధిదారుల కోసం 68 లక్షల 81 వేల రూపాయల చెక్కులను నేడు పంపిణీ చేసినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నధని ఆయన వివరించారు. ఇప్పటికే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తాజాగా వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తాజాగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం తీసుకున్న కీలక నిర్ణయం రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కీలక నిర్ణయాలపై దిశా నిర్దేశం తమ ముఖ్యమంత్రి చేశారని అన్నారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారనీ అందరికీ రేషన్ కార్డుతో దీనికి లింకు పెట్టకుండా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో ప్రతి ఒకరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని రేవంత్ రెడ్డి సూచించారని ఇంకా అనేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం చెంది తిరుపతిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చెన్నయ్య, డంగు శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీం, ముబారక్, బాలరాజ్ గౌడ్, అందే మోహన్, ఖదీర్, మధురాపురం మాజీ ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, పుల్లారెడ్డి, సింగారం సుదర్శన్
మండల పార్టీ అధ్యక్షులు రాజు, అగనూరు బస్వం, రాజేందర్ రెడ్డి, దిలీప్, రాయికల్ శ్రీనివాస్, మన్నెరవి తదితరులు పాల్గొన్నారు..
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >