Posted on 2024-08-05 15:27:46
హాస్టల్స్ విద్యార్థులని చిన్నచూపు చూస్తే సహించబోము అని ప్రభుత్వాన్ని హెచ్చరించిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు కంచర్ల రవి గౌడ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
రవి గౌడ్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ ఏకలవ్య వసతి గృహాల్లో సరియైన ఆహారం అందివ్వక సరియైన మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల బడుగు బలహీన పేద విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని. మొన్నటి రోజున మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉడకని అన్నం,పురుగులు రాళ్లు ప్రత్యక్షం అయ్యాయని నీళ్ల చారు అందిస్తున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు భోజనం తినలేక పోతున్నామని ఉడకని అన్నం తింటే కడుపునొప్పి వస్తుందని తమ తల్లి తండ్రుల వద్ద ఏడుస్తూ అరిగోసలు పడుతున్నారని విద్యార్థులను వసతి గృహాల్లోకి పంపడానికి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారని. వెంటనే విద్యాశాఖ మంత్రిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని నియమించి విద్యార్థులకు వసతి గృహాల్లో సరియైన మౌలిక సదుపాయాలు కల్పించాలని వారికి న్యాయమైన ఆహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నెల రోజుల నుంచి త్రాగునీరు లేక స్నానాలకు కూడా నీరు లేక విద్యార్థులు స్నానాలు కూడా చేయడం లేదని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారి కంపు కొడుతున్నాయని అనారోగ్యాలకు గురవుతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరుగుతుంది
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్. నాయకులు కోడం వెంకటేష్. కోడి రోహిత్ సాయి.కోలాపురం అరవింద్. బైరగొని హర్షిత్. అభిషేక్. నవీన్. తిరుపతి తదితరులు పాల్గొన్నారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >