డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: న్యాయం చేసి న్యాయవాదులే న్యాయం కోసం రోడ్లపైకి వచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
సిరిసిల్ల జిల్లా కోర్టు నుంచి ప్రెస్ క్లబ్ వరకు పాదయాత్ర చేపట్టారు .అనంతరం ప్రెస్ క్లబ్లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు..
వివరాల్లోకి వెళితే.. సివిల్ కేసులలో పోలీసులు అనవసరంగా తలగూర్చి క్రిమినల్ క కేసులుగా మారుస్తున్నారని ప్రధాన ఆరోపణ.
కక్షిధారానికి కోర్టు ఇచ్చిన ఆర్డర్ను తుంగలో తొక్కి దాన్ని పట్టించుకోకుండా కోర్టు వారు ఇచ్చిన ఉత్తరువుదారును పైననే క్రిమినల్ కేసులు పోలీసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఐదు రోజులుగా కోర్టు విధులు బహిష్కరించినప్పటికిని పోలీసు శాఖలో ఎలాంటి చలనం లేదని వాపోతున్నారు.
ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి సివిల్ కేసులలో జోక్యం చేసుకోకుండా చట్టాన్ని కోర్టును గౌరవించాలని అన్నారు. లేని పక్షంలో న్యాయం చేసేదాకా కోర్టు విధులు బహిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దోర్నాల సంజీవరెడ్డి ప్రధాన కార్యదర్శి తంగళ్ళపల్లి వెంకటి సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.