| Daily భారత్
Logo




బరాబర్ హిందువుల పక్షాన మాట్లాడుతా : కేంద్ర మంత్రి బండి సంజయ్

News

Posted on 2024-08-04 17:58:12

Share: Share


బరాబర్ హిందువుల పక్షాన మాట్లాడుతా : కేంద్ర మంత్రి బండి సంజయ్

గుర్రంగూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని గుర్రంగూడా గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ తల్లి మరియు మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో  కేంద్రం శాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు  బండి సంజయ్ కుమార్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు బిజెపి పార్లమెంటు విప్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల  శ్రీరాముల యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు  నిర్వహించారు. అనంతరం బండి సంజయ్  ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గుర్రంగూడా ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు, అలాగే హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి బరాబర్ మాట్లాడుతామని హిందువుల పక్షాన ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుందని దాన్ని మతతత్వ పార్టీ అని అనుకుంటే వారి విజ్ఞతకే వదిలేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. గత ప్రభుత్వం  ఎంఐఎంతో దోస్తాన్ చేసుకుంటూ కాలం గడిపిందని అందుకే ప్రజలు వారిని పక్కనపెట్టి కాంగ్రెస్ ను గద్దనెక్కిస్తే ఇప్పుడు కాంగ్రెస్ కూడా మళ్లీ ఎంఐఎం పార్టీతో చేతులు కలిపి మైనార్టీ వర్గానికి కొమ్ముకోస్తున్నారని అని అన్నారు.  బిఆర్ఎస్ ధరణి పేరుతో 2 లక్షల కోట్ల కుంభకోణం చేశారని వారికి పోటీగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణ జరుపకుండా కొత్తగా భూమాత పేరుతో భారీ కుంభకోణం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ భూమాత కాంగ్రెస్ పాలిట భూమేత అవుతుందని అన్నారు, ఏదేమైనా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకురావాలో అన్ని నిధులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భూమాఫియా లీడర్లను ప్రోత్సహిస్తుందని దీనికి నిదర్శనం కొన్ని వందల  ఎకరాలలో అక్రమంగా లేఅవుట్లు చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చి మళ్లీ అదే వ్యక్తికి నూతనంగా ఏర్పాటు కానున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కి డైరెక్ట్ రోడ్డు కోసం భూసేకరణ చేయాల్సిన బాధ్యత కూడా తనకే అప్పగిస్తే ఇక్కడ ఉన్న రైతులకు మరియు నిరుద్యోగులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు తప్ప వాళ్ళకి మేలు చేసిన వారు కారు అని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి , బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకూలి వెంకటరెడ్డి , స్థానిక కార్పొరేటర్లు గడ్డం లక్ష్మారెడ్డి , దడిగ శంకర్, ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గూడెపు ఇంద్రసేన, రామిడి వీరకర్ణ రెడ్డి, జక్కిడి మధుసూదన్ రెడ్డి, జక్కిడి జంగారెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మద్ది రాజశేఖర్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, కొండా శ్యాంసుందర్ రెడ్డి, కొండా హేమంత్ రెడ్డి బిజెపి బిజెవైఎం నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >