మా గోడు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు
శాసన మండలిలో మదాసీ మాదారి కురుమల సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మదాసి మాదారీ కురుమల సమస్యల పట్ల మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి శాసన మండలి లో ప్రస్తావించడం పట్ల ఆ సంఘం నాయకులు ఎమ్మెల్సి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్బంగా షాద్ నగర్ మదాసి మాధారి కురువ సంఘం తాలూకా ప్రదాన కార్యదర్శి కోరే రాజు, మీడియా కన్వినర్ బండ కుమార్ లు మాట్లడుతూ న్యాయమైన హక్కు సాధించుకునేందుకు మదాసి మాదారి కురువలం ఎంతో కాలంగా పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. శుక్రవారం శాసన మండలి లో తమ బాధ అర్థం చేసుకున్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆయనకు మదాసి మాదారి కురువసంఘం ఎప్పుడూ రుణపడి ఉంటుందనీ, సంఘం సభ్యులందరి తరపున ఎమ్మెల్సీ కి ధన్యవాదాలు తెలిపారు.