Posted on 2024-08-02 18:34:03
ధరణి దరిద్రం..!
ధరణితో దొరలు కావలసినంత దోచేశారు
తెలంగాణ అసెంబ్లీలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తమకు కావలసిన భూములను దోచేయడానికి దొరలు తెచ్చుకున్న ధరణి తెలంగాణ రాష్ట్రంలో ఒక దరిద్రం అని, ధరణి వల్ల పేద రైతులు ఇబ్బందులకు గురై కొంతమంది రైతులు చనిపోయారని.. ఈ ధరణి చట్టాలను సముల మార్పులు చేసి రైతులకు వెసులుబాటు కల్పించాలని, ధరణి వల్ల కలెక్టర్లు కలెక్షన్ కింగులయ్యారంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధరణి అంశంపై మాట్లాడారు. రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ధరణిపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ధరణి చట్టాన్ని సమూల మార్పులు చేయాలని శాసనసభకు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ధరణి ప్రవేశపెట్టినప్పటి నుండి గ్రామాల్లో రైతులు తమ భూములు అమ్మలేక కొనలేక ఎన్నో భయ ప్రయాసలకు ఓర్చారని అన్నారు. ఒక కుటుంబంలో తండ్రి చనిపోతే వారి పిల్లలు విరాస చేసుకునే పరిస్థితి కూడా ధరణి వల్ల ఇబ్బందులు నెలకొన్నాయని అన్నారు. అన్నదమ్ముల మధ్య చిన్న ఫిర్యాదులు ఉంటే కూడా భూములు వాళ్ల పేరిట చేసుకోలేని అధ్వానమైన పరిస్థితి గతంలో నెలకొందని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. చిన్న ఫిర్యాదు ఉన్నా ధరణిలో పొలాలు నిషేధం విధించి ఎలాంటి చర్యలు లేకుండా దోచుకున్నారని శంకర్ ఆరోపించారు. రెవిన్యూ క్రయవిక్రాల సందర్భంగా స్థానిక వీఆర్వోలు ఏదో చిన్న పనులకు 200 లేక 300 రూపాయలు తీసుకుంటే వారిని శాఖ నుండి తొలగించారని అదే ధరణి వల్ల కలెక్టర్ లే కలెక్షన్ కింగ్లు అయ్యారంటూ ఎమ్మెల్యే శంకర్ సంచలన ఆరోపణలు చేశారు. లోకబోయిష్టమైన ధరణిని సరిచేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ధరణి రాష్ట్రంలో అవినీతిమయమైందని అన్నారు. ప్రజాక్షేత్రంలో ధరణిని తమ ఇష్టానుసారంగా వాడుకున్నారని ఆరోపించారు. గ్రామాల్లో చిన్న తగువులు గ్రామ పెద్దలు తీర్చేవారని కానీ ధరణి పెట్టడం వల్ల చిన్న సమస్య కూడా జటీలమైందని విమర్శించారు. ధరణి సమస్యలతో వాటిని ఎదుర్కోలేక ఎంతో మంది రైతులు చనిపోయిన దాఖలాలు ఉన్నాయని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. ఉదాహరణకు పది ఎకరాలలో ఒక అర ఎకరాకు చిన్న వివాదం ఉన్న మొత్తం పది ఎకరాలు నిషేధంలో పడిపోవడంతో ఆ రైతు భూమిని అమ్మే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. గతంలో భూముల అమ్ముకున్న రైతాంగం పేర్లు మళ్లీ ధరణిలో చూపిస్తే ఆ పేర్లతో భూములు కొన్నవారు మళ్లీ సమస్యను గుదిబండ చేసేవారని ఎన్నో అవకతవకలకు రైతుల భూములకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ధరణిలో నెలకొన్న సమస్యల వల్ల రైతులు ఏం చేయాలో తెలియక ఆకృషంతో కొన్ని ప్రాంతాల్లో తహసీల్దారులపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఉండేవని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో ధరణి అడ్డంగా పెట్టుకుని తమ కావాల్సిన భూములను దర్జాగా దోచుకున్నారని, ఈశాన్య తెలంగాణలో దొరలు తమ కావాల్సిన భూములు సంపాదించి పెట్టుకున్నారని ఆరోపించారు. ధరణి రైతులకు ఎంత మాత్రం ప్రయోజనం కాదని అన్నారు. ధరణి సమూల మార్పులు చేసి రైతంగానికి వెసులుబాటు కల్పించాలని ఎమ్మెల్యే శంకర్ శాసనసభలో స్పీకర్ ను కోరారు..
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >