| Daily భారత్
Logo




నావి మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ నీ ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-25 11:01:45

Share: Share


నావి మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ నీ ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వైద్యాన్ని వ్యాపారంగా చూడవద్దు

సరైన రోగనిర్ధారణ చేయండి ప్రాణాలు కాపాడండి

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పిలుపు

షాద్ నగర్ లో బి ఆర్ కే న్యూస్ గ్రూప్ ఆధ్వర్యంలో "నావి" మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మనుషులకు ఆ బ్రహ్మ ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని రక్షించేది వైద్యుడు మాత్రమే అని అలాంటి వైద్యరంగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంచుకొని పదిమంది ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన బి.ఆర్.కె న్యూస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "నావి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్" యాజమాన్యాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మనస్ఫూర్తిగా అభినందించారు. గురువారం పట్టణంలో బి ఆర్ కే న్యూస్ గ్రూప్ ఏర్పాటుచేసిన నావి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లాంచనంగా ప్రారంభించారు. బి ఆర్ కె న్యూస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియా ప్రతినిధులు తదితరులు కలసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేదమంత్రాల నడుమ ఆసుపత్రిని ఎమ్మెల్యే శంకర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ను ఆసుపత్రి యాజమాన్యం బి ఆర్ కే గ్రూప్ చైర్మన్ 

బొల్లా శివరామకృష్ణ, డైరెక్టర్ పృథ్వీ కుమార్ స్థానిక ఎమ్మెల్యే శంకర్, స్ధానిక మీడియా ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు అంటే ప్రజలు జంకుతున్నారని తెలిపారు. ఆసుపత్రికి ఎవరైనా అనారోగ్యంతో వస్తే వారిని కొన్ని ఆసుపత్రులు భయపెట్టి చంపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ధనార్జన కోసమే ఆసుపత్రులను నడుపుతున్నారని విమర్శలు వ్యక్తం చేశారు. పేద ప్రజల ప్రాణం పట్టదని ఉన్నోడికి లేనోడికి ఒకే తీరు వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. ముందుగా ఆసుపత్రికి పేషెంట్ వస్తే అతడి వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఎంత వైద్యం చేసుకోగలడు? అనే ఆర్థిక కోణంలో చూస్తున్నారే తప్ప ముందు అతని ప్రాణానికి ఒక భరోసా ఇవ్వడంలో ప్రైవేటు ఆసుపత్రులు విఫలం అవుతున్నాయని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు ఉన్నప్పటికీ మెరుగైన వైద్యం మెరుగైన ఆర్థిక స్తోమత ఉన్న వారికి మాత్రమే దక్కుతుందనే విమర్శలు ఉన్నాయని అన్నారు. బి ఆర్ కే న్యూస్ గ్రూప్ ద్వారా ఏర్పాటుచేసిన నావి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు నిష్పక్షపాతంగా ఉండాలని రోగుల రోగనిర్ధారణ సరిగ్గా చేసి వారికి నాణ్యమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. తన బంధువులకు కూడా ప్రైవేట్ ఆసుపత్రి ఉందని అయితే కనీస విలువలు పాటించి ధర్మంగా ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వాలని తాను వారికి సూచించినట్టు చెప్పారు. ముందుగా రోగికీ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అవన్నీ వదిలేసి కేవలం ఆర్థికంగా వ్యాపారంతో చికిత్స చేయడం భావ్యం కాదని ఎమ్మెల్యే సూచించారు.  ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ చెట్ల పావని, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, స్థానిక మీడియా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆహ్వానితులను పూల బొకే శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ కె స్ధానిక  జర్నలిస్ట్ చందు, ఎండి ఖాదర్ గోరి, అందె మోహన్, సుదర్శన్ గౌడ్, మాజీ ఎంపిటిసి కొమ్ము కృష్ణ, లింగారెడ్డి గూడా అశోక్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >