Posted on 2024-07-25 14:29:33
షాద్ నగర్ మీడియాపై ఉన్న అపోహలు తొలగిపోవాలి
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" సూచన
మీడియా విలువలు దిగజార్చేలా ఉండకూడదు
వివాదాలకు స్వస్తి చెప్పడం శుభ పరిణామం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జర్నలిజం అంటే పదిమందికి ఉపయోగపడే రీతిలో ఉండాలే తప్ప ప్రజలకు ఇబ్బందులు సృష్టించే ఆయుధం కారాదని, జర్నలిస్టు తన విలువలను కాపాడుకుంటూ ఇతరులకు విలువ తెచ్చే ప్రయత్నాన్ని చేయాలని.. సమాజంలో స్వార్థ ప్రయోజనాల కోసం మీడియా విలువలు దిగజార్చే ప్రయత్నం ఎవరూ చేయకూడదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హితవు పలికారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రింట్ మీడియా సమావేశానికి పలువురు స్థానిక మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. నూతనంగా ఎన్నుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కమిటీకి నూతన అధ్యక్షుడు సత్యనారాయణకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇష్టా గోష్టిగా మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. జర్నలిజం ఎంతో గొప్ప ఆయుధమని దానిని సరిగ్గా వాడకపోతే సమాజానికి నష్టమని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో గతంలో మీడియా అంటే ఓ రెస్పెక్ట్ ఉండేదని, కానీ మారుతున్న కాలానుగుణంగా మీడియాలో కొందరి ప్రవర్తన వల్ల విలువలు దిగజార్చే విధంగా కొందరు ప్రవర్తించడం జరిగిందని, దీనిని ఆసరా చేసుకొని ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా తమ పబ్బం గడుపుకున్నారని చెప్పారు. మీడియాలో తగాదాలు, వివాదాలు, కేసులతో గతం ఎంతో భయంకరంగా ఉండేదని ఇప్పుడు భిన్న పరిస్థితుల మధ్య స్థానిక ప్రింట్ మీడియా జర్నలిస్టులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ పరిణామం అని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలు సంతోషంతో ఉండాలని, అనవసర వివాదాలు తగువులు మంచివి కావని సూచించారు. జర్నలిజానికి విశ్వాసాలు ప్రధానమని.. విశ్వాసం పోయాక ఎంత చేసినా అది గాడిలో పడదని అన్నారు. గత స్మృతులు మరిచిపోయి అందరూ హాయిగా ఉండాలని తప్పు ఒప్పులు తెలుసుకొని పశ్చాతాపంతో ముందుకు సాగిన వారే నిజమైన వ్యక్తిత్వం గల వారని ఎమ్మెల్యే అన్నారు. జర్నలిస్టులను ప్రలోభాలకు గురి చేయడం వారి మధ్య రాజకీయ నాయకులు తగవులు సృష్టించడం వాటి ద్వారా తమ పబ్బం గడుపుకోవడం లాంటివి తాను ప్రోత్సహించబోనని ఎమ్మెల్యే అన్నారు. జర్నలిజం నిఖార్సుగా ఉండాలని ఎవరిని తప్పు చేసినా ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. గతంలో ఎంతో మంది జర్నలిస్టులు తప్పుడు కేసుల వల్ల వారి కుటుంబాలు ఎంతో మానసిక క్షోభకు గురయ్యాయని, అన్ని విధాలుగా వారు నష్టపోయారని ఎమ్మెల్యే సానుభూతి వ్యక్తం చేశారు. గతం గతః అని కొత్త జీవితాన్ని ప్రారంభించి సరికొత్త మలుపుకు దిక్సూచి కావాలని అన్నారు. మీడియాకు ప్రభుత్వం అండ ఉంటుందని వారికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి తీర్చుతానని చెప్పారు. మీడియా సమస్యలు తనకు మొత్తం తెలుసని వాటిపై ఎలా స్పందించాలో కూడా తనకు తెలుసని పేర్కొన్నారు. మీడియా కూడా ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని చెప్పారు. సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా విలువలను కాపాడడానికి జర్నలిస్టు కంకణ బద్ధులై ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో తనకున్న కొన్ని చేదు అనుభవాలను కూడా నెమరు వేసుకున్నారు. ఒకప్పుడు మీడియా అంటే ఈ ప్రాంతానికి ఎంతో గొప్ప పేరు ఉండేదని ఆ పరిస్థితి దిగజారిపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా మీడియాకు ఎవరో చేసిన వ్యవహారాల వల్ల చెడ్డ పేరు వచ్చిందని ఈ సందర్భంగా ఇష్టాగోష్టిలో ఎమ్మెల్యే మనసు విప్పి స్పష్టం చేశారు..
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >